📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sharmila : జగన్‌కు మానవత్వమే లేదంటూ షర్మిల ఫైర్

Author Icon By Sudheer
Updated: June 23, 2025 • 8:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పల్నాడు జిల్లా రెంటపాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చీలి సింగయ్య (Singayya ) మృతి చెందిన ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనకు కారణం జగన్ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆమె “ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా కనీస మానవత్వం చూపకుండా, ఫేక్ వీడియో అంటూ తప్పును కప్పిపుచ్చుకోవడం అమానుషం” అని పేర్కొన్నారు. నిజంగా బాధ్యత కలిగిన నేత అయితే, బాధిత కుటుంబానికి తక్షణమే 5 నుంచి 10 కోట్లు పరిహారం ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

జనసమీకరణ కోసమే జగన్ పర్యటనలు

జగన్ నిర్వహిస్తున్న పర్యటనలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాకుండా, తన బలం చూపించేందుకు చేస్తున్న బలప్రదర్శనలేనని షర్మిల ఆరోపించారు. “తనకు డబ్బు ఉందని, బలం ఉందని చూపించడమే ఆయనకు ముఖ్యమైంది. ప్రజల సమస్యలపై ఆయనకు పట్టింపు లేదు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వారందరినీ విచారణకు పిలవాలని డిమాండ్ చేస్తూ, ఆ సమయంలో జగన్ కనీసం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా వెళ్లిపోయారని, ఇది తీవ్రమైన నిర్లక్ష్యానికి ఉదాహరణ అని విమర్శించారు.

విభిన్న నిబంధనల ఉల్లంఘన

జగన్ కాన్వాయ్‌కి అనుమతించిన వాహనాల కంటే ఎక్కువ వాహనాలతో ప్రయాణించడమూ, సైడ్ బోర్డుపై నిలబడటం వంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని షర్మిల తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. “జగన్‌కు మానవత్వం అనే పదానికి అర్థమే తెలియదు. ఇంతవరకూ సింగయ్య కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనం” అని షర్మిల గట్టిగా విమర్శించారు.

Read Also : Iran : ఇజ్రాయిల్ దాడుల్లో 500 మంది మృతి

Google News in Telugu Jagan Jagan Vehicle sharmila Singayya Dies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.