📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sharmila : జగన్ హాట్‌లైన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్

Author Icon By Divya Vani M
Updated: August 14, 2025 • 10:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), వైసీపీ అధినేత జగన్ (Jagan)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టిడిపి అధినేత చంద్రబాబుకు మధ్య హాట్‌లైన్ ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు.జగన్ చెప్పిన హాట్‌లైన్ రాహుల్, చంద్రబాబుకి కాదు. అసలు హాట్‌లైన్ జగన్, ప్రధాని మోదీ, హోం మంత్రిగా ఉన్న అమిత్ షా మధ్య ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, కేంద్రాన్ని మెప్పించడమే ఆయన లక్ష్యంగా ఉంది అని షర్మిల ఆరోపించారు.షర్మిల మాట్లాడుతూ, జగన్ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం కూడా కనబరచడం లేదు. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఆయనకు అనిపించదా? ఇలా మోదీకి దాసోహంగా మారి ఎలా పాలన చేస్తారు? అని ప్రశ్నించారు.

YS Sharmila : జగన్ హాట్‌లైన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్

పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే

జగన్ రాజకీయ తీరును వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన షర్మిల, పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. తెరవెనుక రాజకీయం, పొత్తులే జగన్కు అలవాటు. అందుకే ఆయన అందరినీ అదేలా అనుకుంటారు, అన్నారు.“రాహుల్ గాంధీకి చంద్రబాబుతో ఎలాంటి హాట్‌లైన్ లేదు. ఇది మేము హామీగా చెబుతున్నాం. అయితే మీరు మోదీ, అమిత్ షాతో హాట్‌లైన్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేస్తారా?” అంటూ షర్మిల జగన్‌ను నిలదీశారు.గత ఐదేళ్ల పాలనలో జగన్ పూర్తిగా బీజేపీకి లొంగిపోయారని షర్మిల ఆరోపించారు. “మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్… తర్వాత అదే మోదీకి వరుసగా నమస్కరించారని ఆరోపించారు. ప్రతి బీజేపీ బిల్లుకూ మద్దతు ఇచ్చారు,” అన్నారు.

విలువైన ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగింపు

గంగవరం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులను మోదీకి సమర్పించారంటూ షర్మిల మండిపడ్డారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఎంపీ పదవులు కూడా బీజేపీ నేతలకు ఇవ్వడాన్ని తప్పుపట్టారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీని మతతత్వ పార్టీగా పేర్కొనేవారు. కానీ ఆయన కుమారుడిగా చెప్పుకునే జగన్, అదే బీజేపీకి దగ్గరవడం సిగ్గు కాదా? అని షర్మిల ప్రశ్నించారు.ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన సంస్కారాన్ని చూపిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఉందా? అని మాణికం విసిరిన సవాలుకు జగన్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదని అన్నారు.

లిక్కర్ స్కాం పై సమాధానం ఇవ్వండి

షర్మిల డిమాండ్ చేస్తూ, లిక్కర్ స్కాంపై స్పష్టత ఇవ్వండి. నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఎలా ఇచ్చారు? నగదు రూపంలో అమ్మకాలెందుకు జరిగాయి?” అని నిలదీశారు.మీదొక పార్టీ, మీరొక నాయకుడంటారా? అసెంబ్లీకి వెళ్లి ప్రజల కోసం, పార్లమెంటులో దేశం కోసం పోరాడలేరు. ఇది ఏ రకంగా నాయకత్వం? అని షర్మిల కుండ బద్ధలు చేశారు.

Read Also :

https://vaartha.com/this-is-what-public-verdict-means-pawan/andhra-pradesh/530346/

#Special Status Jagan Assembly Jagan BJP relationship Jagan Modi hotline liquor scam Sharmila press meet YS Sharmila's criticism YSRCP leadership

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.