📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Shamirpet: మాజీ సిఎం స్వర్గీయ రోశయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూత

Author Icon By Tejaswini Y
Updated: January 13, 2026 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Shamirpet: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) కన్నుముశారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో నగరంలోని వారి నివాసంలో శివలక్ష్మి తుదిశ్వాస విడిచినట్లు సంబంధితులు పేర్కొన్నారు. వయోధిక భారంతోపాటు, కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో ఉంటూ ఆమె నివాసంలో తుది శ్వాస విడిచినట్లు తెలిపారు.

Read also: Oslo: నోబెల్‌ మరొకరికి అంకితం చేయడం కుదరదు: కమిటీ

Shamirpet: Former CM late Rosaiah’s wife Sivalakshmi passes away

నగరంలోని ఆమె నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం దేవరయాంజాల్ లోని వారి వ్యవసాయ క్షేత్రంకు ఆమె పార్థీవదేహాన్ని తీసుకవచ్చి సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు(Shivlakshmi Death) నిర్వహించారు. ఈ దహన సంస్కారాలను ఆమె కుమా రులు కొణిజేటి శివ సుబ్బారావు, కొనిజేటి కృష్ణప్రసాద్, కొణిజేటి మూర్తిలు నిర్వహించారు. శివలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు వారి నివాసంకు చేరుకుని పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగ దేవరయాంజాల్లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు కె.వి.పి. రాంచందర్రావు, బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్రెడ్డి, జిల్లా ఆర్టీఎ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కత్తి రమేశ్, పలువురు పాల్గొని పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. పలువురు శివలక్ష్మి సేవాభావాన్ని, ఆమె జీవన శైలిని పలువురు గుర్తు చేసుకున్నారు. ఆమె మృతిపట్ల ప్రగాఢ సంతాపంను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ప్రజాజీవితానికి దూరంగా ఉంటూనే, తన భర్త కొణిజేటి రోశయ్య రాజకీయ జీవితంలో వెన్నుదన్నుగా నిలిచారని పలువురు స్మరించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Former AP CM Family Google News in Telugu Hyderabad News Konijeti Rosiah Political Condolences Shivlakshmi Death News Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.