📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Seed bill : విత్తన బిల్లు ఎవరి కోసం?

Author Icon By Sudha
Updated: December 3, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదివేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వ్యవ సాయం ప్రారంభమైందని చరిత్ర చెబుతుంది. గతం లో ఎన్నడూ కూడా మన వ్యవసాయం విత్తనాలు ఉత్పత్తి చేసిందే కానీ విత్తనాలు కొనుగోలు చేయలేదు. కానీ హరిత విప్లవం తర్వాత హైబ్రిడ్ విత్తనాల పేర్లతో విత్తనాల అమ్మకం, దిగుమతి పెరిగింది. గత 20, 25 సంవత్సరాల క్రితం ప్రతి రైతు ఇల్లు ఒక ‘విత్తన భాండాగారమే! అప్పుడు రైతులు పండించిన పంటలో కొంత మంచి భాగాన్ని విత్త నాలుగా నిలువ చేసుకొని అదే విత్తనాలను మళ్లీ పెట్టుకుని పెట్టుబడులేని వ్యవసాయం చేసేవారు. కానీ 20, 25 సంవత్సరాల నుండి ప్రభుత్వం, కార్పొరేట్ విత్తన కంపెనీలు క్రమంగా రైతుల దగ్గర నుండి విత్తనాలను దూరం చేసి ఇప్పుడు ఏ చిన్న పంట పెట్టుకోవాలన్న విత్తనాల కంపెనీ లపైన ఆధారపడి భారతదేశ వ్యవసాయ రంగం నడుస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. రైతులకు విత్తనాలు భారం కావడంతో పెట్టుబడులు పెరిగి రైతులు ఆత్మహత్య లకు విత్తనాల కొనుగోలు కూడా ఒక ప్రధాన కారణం అయింది. దేశవ్యాప్తంగా 540 విత్తన కంపెనీలు ఉన్నాయి. అవిసంవత్సరానికి దాదాపు 65 నుండి 70 వేల కోట్ల రూపాయల విత్తన వ్యాపారం చేస్తున్నాయని ఒక అంచనా! వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమైనదో విత్తనం కూడా అంతే ముఖ్యమైనది. ఇది గమనించిన విత్తన కంపెనీలు ప్రతి సంవత్సరం 5000 కోట్ల రూపాయల నకిలీ విత్తనా లు అమ్ముతున్నాయని ఒక అంచనా! ప్రతి సంవత్సరంరెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఒక దగ్గర నకిలీ విత్త నాలతో నష్టపోతున్న రైతులను చూస్తూనే ఉన్నాం. తాజా గా మెదక్ జిల్లా, చేగుంట మండలం, రుక్మాపూర్ గ్రామంలో ఒక విత్తన కంపెనీ వరి నకిలీ విత్తనాలతో సుమారు 45 మంది రైతులు 100 ఎకరాలలో వరి పంట వేస్తే ఒక ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఆ నకిలీ విత్తనాలతో ఒక ఎకరాకు 6, 7 క్వింటాళ్ల దిగుబడి మాత్ర మే రావడంతో ఆ రైతులు ఆత్మహత్యలే శరణ్యమని లబోదిబోమంటున్నారు. ఈ నకిలీ విత్తనాలతో పంటదిగుబడి రాలేదని ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎవరికి మొరపెట్టు కోవాలో కూడా సరైన వ్యవస్థ లేక రైతులు నష్టపోతున్నారు.

Read Also : AP: అమరావతికి రాజధాని హోదా

Seed bill

నకిలీ విత్తనాలను అరికట్టాలి

కేంద్ర వ్యవసాయ శాఖ విత్తన బిల్లు (Seed bill) 2025 డిసెంబర్ 11 వరకు రైతులు, రైతు సంఘాలు సూచనలు చేయవల సిందిగా కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఈ బిల్లు సాగుదారుల కోసమా? కార్పొరేట్ల కోసమా? అని రైతులు, రైతు సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికడుతుందని చెబుతోంది, కానీ విమర్శకులు కార్పొరేట్ పక్షపాతం, జన్యువైవిధ్యానికి ముప్పు, దేశ విత్తనాల ప్రస్తావనలేదని హెచ్చరిస్తున్నారు. 16 నవంబర్ 2025, విత్తన రంగాన్ని నియంత్రించే నిబం ధనలను సమూలంగా మార్చడానికి భారత ప్రభుత్వం రూ పొందించిన ముసాయిదా విత్తనాల బిల్లు,(Seed bill) 2025, 1966 విత్తనాల చట్టం, 1983 విత్తన నియంత్రణ ఉత్తర్వులను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.కొత్త చట్టం నాణ్య మైన విత్తనాల సరఫరాను మెరుగుపరుస్తుందని, నకిలీలను అరికట్టగలదని, రైతులకు ఎక్కువ రక్షణ కల్పిస్తుందని అధి కారులు చెబుతున్నారు. కానీ, 2004, 2019లో మునుపటి ప్రయత్నాల మాదిరిగానే, ఈ బిల్లు తీవ్ర విమర్శలను ఎదు ర్కొంటుంది. రైతు సంఘాలు, విత్తన నిపుణులు, పౌర సమాజ సంస్థలు ప్రతిపాదిత చట్టం సాధారణ సాగుదారుల కంటే, ముఖ్యంగా సాంప్రదాయ, రసాయన రహిత వ్యవసా యంపై ఆధారపడే వారికంటే విత్తన కంపెనీలు వ్యవసాయ వ్యాపారాలకు బాగా సరిపోతుందని అంటున్నారు. రైతు విత్తనాలు కొన్నప్పుడు విత్తనాలు అమ్మే కంపెనీ జిల్లా వ్యవ సాయ అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. జిల్లాలో ఏ డీలర్ కు ఎంత సీడ్ ఇచ్చారో కంపెనీ జిల్లా వ్యవ సాయ అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. జిల్లా వ్యవసాయ అధికారికి కంపెనీ వారు సీడ్ ఎక్కడ ఉత్పత్తి చేసింది? ఏ రైతు వద్ద ఉత్పత్తి చేసింది? తనిఖీ చేసి రిపోర్ట్ ఇచ్చిన అధికారి, కంపెనీ వివరాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన యూనిట్ వివరాలు అన్నీ కూడా ఇవ్వాలి. సర్టిఫై చేసిన ఇన్స్పెక్టర్ ఇచ్చిన వివరాలు కూడా ఇవ్వాలి. కంపెనీ వేరే రాష్ట్రంలో నమోదు అక్కడ కార్యకలాపాలు చేస్తుంటే కంపెనీ ఆఫీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వేరే రాష్ట్రా లలో ఉన్నప్పుడు ఆ కంపెనీ సీడ్ అమ్ముతున్న రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ కార్యాలయంలో నమోదు చేసు కోవాలి. డీలర్ ఏ రైతుకు ఎన్ని విత్తనాలు అమ్మినది, రైతు కు బిల్లు ఇవ్వాలి. బిల్లులో డీలర్ సంతకం, లేదా వేలిముద్ర వేయాలి. డీలర్ ఏ రైతుకు ఎన్ని విత్తనాలు అమ్మినది జిల్లా వ్యవసాయ అధికారికి తెలియజయాలి.

Seed bill

సీడ్ వెరి ఫికేషన్ అధికారులను నియమించాలి

రైతు తన పొలంలో పండిన పంటను విత్తనం కొరకు వాడిన ఇతర రైతులకు విత్తనం కొరకు అమ్ముకున్న జిల్లా వ్యవసాయ అధికారికి తెలియజేయాలి. విత్తనం కొన్నరైతులు కూడా ఏ రైతు వద్ద నుండి కొన్నది ఆ రైతు వివరాలు జిల్లా వ్యవసాయ అధికారికి తెలియజేయాలి. జిల్లా వ్యవసాయ అధికారి ఉద్యానవనాధికారి ఆధ్వర్యంలో జిల్లాకు ఇద్దరు సీడ్ వెరి ఫికేషన్ అధికారులను ప్రభుత్వం నియమించాలి. నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసి సరఫరా చేసిన వ్యక్తులకు లేదా కంపెనీలకు కఠినమైన శిక్షలను తక్షణమే అమలు చేయాలి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం పొందడానికి సుల భమైన మార్గం ఉండాలి. స్థానిక మండల వ్యవసాయ అధి కారి రిపోర్టు ఆధారంగా నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఒక నెలలోపు అందించే విధంగా చట్టం ఉండాలి. విత్తనాల పైన ధరల విషయంలో రాష్ట్రప్రభుత్వ నియంత్రణ ఉండాలి. విత్తనాల ఉత్పత్తిపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనియంత్రణ, పర్యవేక్షణ కూడా ఉండాలి. విత్తనాల పైన కృత్రిమ కొరత సృష్టిస్తే భవిష్యత్తులో ఆ కంపెనీకి అనుమతులు ఇవ్వకూడ దు. దేశీయ లేదా సంప్రదాయ విత్తనాలను కాపాడుకొని భద్రపరిచే విధానం చట్టంలో ఉండాలి. రైతులు సౌత పద్ధ తులలో విత్తనాలు కాపాడుకునే పద్ధతిని ప్రోత్సహించాలి. 60 శాతం పైగా ఆధారపడ్డ వ్యవసాయ రంగానికి ప్రధా నమైన విత్తన చట్టాన్ని సవరణ చేస్తున్నారు. ఇంత పెద్ద చట్ట సవరణకు తూతూ మంత్రంగా కొన్ని రోజులు కాకుండా ఒక సంవత్సరం దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ఒక పెద్ద చర్చ పెట్టి, మట్టి మనుషులైనా రైతుల నుండి రైతు సంఘాలు, మేధావుల నుండి అభిప్రాయాలు తీసు కొని చట్ట సవరణ చేయాలి.
-పులి రాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

agriculture policy Breaking News Farmers Indian Agriculture latest news Seed Bill seed regulation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.