📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Seed Act: పటిష్టమైన విత్తన చట్టమెప్పుడు?

Author Icon By Sudha
Updated: November 7, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాధపడడమే తప్ప బాధించడం తెలియని అన్నదాతల్లో ఇటీవల కాలంలో సహనం, ఓర్పు సన్నగిల్లి ఆందోళనల బాటలుపడుతు న్నారు. తమ కెంతటి నష్టం జరిగినా ఎవ్వరు, ఎంతగా మోసగించినా తమలో తాము కుళ్లి కుళ్లి మన సులో బాధపడి, చివరకు ప్రాణత్యాగం చేయడానికి అయి నా సిద్ధపడతారు తప్పతమను దగా చేసినవారిపై కక్ష కట్టి దాడులు చేసేందుకు సాహసించకపోయేవారు. పంట లకు గిట్టుబాటు ధర రాకపోయినా, దళారుల హస్తలాఘ వంతో కోలుకోలేని దగాకు గురవుతున్నా తమ కర్మకు తామే బాధపడుతూ మౌనరోదనతో ఇంటి ముఖం పట్టే వారు. కానీ ఇటీవల కాలంలో రోడ్లపైకి రావడం, ధర్నాలు, నిరసనలు లాంటి కార్యక్రమాలు తెలిపేందుకు స్వచ్ఛం దంగా ముందుకు వస్తున్నారు. అవి అక్కడక్కడ అప్పటి కప్పుడు జరుగుతున్నాయే తప్ప సంఘటితంగా జరుగు తున్న సందర్భాలు లేవని చెప్పొచ్చు. ఆరుగాలం అష్టకష్టాలు పడి తెచ్చిన పంటలను అమ్ముకోవడంలో వారుపడు తున్న ఇబ్బందులు
అన్నీఇన్నీ కావు. దేశంలో చూసినా అధికశాతం మార్కెట్ యార్డుల్లో దళారులే రాజ్యం. కొలతల్లో మోసం, ధరలను నిర్ణయించడంలో దగా, ఒక్కటేమిటి ఎక్కడ వీలైతే అక్కడ చేతివాటం ప్రదర్శించేందుకు దళారులు నిత్యం పొంచి ఉంటూనే ఉంటున్నారు. రైతులు మోసాలకు గురవుతూనే ఉన్నారు. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారన్నట్టే ఈదళారీ వ్యవస్థ ఉన్నంత కాలం రైతులకు ఈ బాధలు తప్పవు. విత్తే దగ్గర నుంచి విక్రయించేవరకు అన్ని స్థాయిల్లో దగా జరుగుతున్నది. దీనిని నిరోధించేందుకు పాలకులు ఎప్పటి కప్పుడు చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. వ్యవసాయానికి మూలం విత్తనాలు. ఆ విత్త నాలే నకిలీవో, నాసిరకం అయితే రైతులు కుప్పకూలిపో తారు. నకిలీ, నాసిరకం విత్తనాలు సరఫరా చేసి రైతు లను నిలువునా మోసం చేసినవారిని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పిడి చట్టాన్ని ప్రయోగించి కటకటలా వెనక్కి పంపేందుకు వెనుకాడమని హెచ్చరికల మీద హెచ్చరికలు పాలకులు చేస్తున్నా ఈ నకిలీ విత్తన వ్యాపారులు అవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. యేడాది యేడాదికి నకిలీ విత్తనాల వ్యాపారం దేశవ్యాప్తం గా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకు పెరిగిపో తున్నది. అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని పత్తికి మంచి ధర వస్తుందనే అంచనాలతో ప్రభుత్వాలు కూడా పత్తి సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ను ఆసరాగా తీసుకొని రకరకాల విత్తనాలు భారీ ఎత్తున సరఫరా అవుతున్నాయి. రసీదులు, బిల్లులు ఎలాంటి ఆధారాలు లేకుండా వేలాది క్వింటాళ్ల కూరగాయల విత్త నాలు ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. వీటికి రైతులు అడిగిన ఎలాంటి రసీదులు కానీ, ఆధారాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఫారం బాహాటంగా జరుగుతున్నా, అధికారులకు అందరికి తెలిసినా, మౌనం గా ఉండిపోతున్నారు. రైతులు ఎవరైనా ఫిర్యాదు చేసిన ప్పుడు అన్నదాతలనే సముదాయించి రాజీమార్గాలను అన్వేషిస్తున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలవైపు అడుగులు వేయలేకపోతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఈ నకిలీ వ్యాపారం జరగడం లేదు. అన్ని నగరాల్లో, పట్టణాల్లోనూ బాహాటంగానే జరుగుతున్నాయి. ఈ ఖరీఫ్ లో కూడా పెద్దఎత్తున నాసిరకం కూరగాయల విత్తనాల కొని రైతులు మోసపోయారు. రాబోయే రబీలో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు కృత్రిమ డిమాండ్ను సృష్టించి ఇష్టానుసారం గా రేట్లు పెంచుతున్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విత్తనాల కొరత దృష్ట్యా ఈ నాసిరకం విత్తనాల వ్యాపారంపై ఆధారపడక తప్పడం లేదు. ఈ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు గత రెండు, మూడు దశాబ్దా లుగా పాలకులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. పోలీసులన్నా, చట్టాలన్నా, వ్యవసాయ అదికారులన్నా పాలకులు చేసే హెచ్చరికలు అన్నా భయ భక్తులు లేకుండాపోయాయి. ఎందుకు ఇతర కారణాల కంటే విత్తన చట్టమే(Seed Act) రైతుల కంటే దళారులకే ప్రయోజనకరంగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి దాపురిస్తున్నది. కొత్త పటిష్టమైన చట్టం కావాలని ఏనాటి నుంచో రైతులు కోరుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. మనదేశంలో విత్తన చట్టం (Seed Act) 1966 నాటిది. 1983లో విత్తన నియం త్రణ ఉత్తర్వులను అప్పటి కేంద్రప్రభుత్వం జారీ చేసింది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 1986లో మరొక చట్టా న్ని తీసుకువచ్చారు. ఇక నకిలీ, నాసిరకం విత్తనాలు పెద్ద ఎత్తున మార్కెట్లో వస్తున్న విషయాన్ని గుర్తించి ధృవీక రణ ప్రాధాన్యాన్ని గుర్తించిన పాలకులు 2016లో విత్తన సేంద్రీయ ధృవీకరణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేశారు. విత్తన పంటలను మూడు నుంచి నాలుగుసార్లు తనిఖీ చేయాలనే నిబంధనను విధించారు. పంట కోత తర్వాత పరిశ్రమల్లో శుద్ధి చేసిన విత్తనాలను, నమూనాలను తీసి ప్రయోగశాలలో నాణ్యతను పరిశీలించాలి. నాణ్యమైనవిగా తేలిన తర్వాత వాటికి ధృవీకరణ పత్రం ఇచ్చి విడుదల చేయాలి. కానీ ఈ ప్రక్రియ అంతా సక్రమంగా జరగడం లేదనే విషయం తెలియందికాదు. మనదేశానికి సేద్యమే జీవనాధారమన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు పాలకులు అడుగులు వేయాలి. ముందుగా అన్నదాత లను దగాచేస్తున్న ఈనకిలీ, నాసిరకం వ్యాపారులపై ఉక్కు పాదం మోపాలి. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని వాచావాత్సల్యం చూపడం కావాల్సింది చేతల్లో చూపాలి.

Read hindi news :hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

agriculture Breaking News farming indian-agriculture latest news seed-act seed-law Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.