కొత్తగా తెచ్చిన విత్తన చట్టంలోని అంశాలుచూస్తే కొరివితో తలగోక్కున్నట్లే అనిపిస్తోంది. అంటే కోరికష్టాలు తెచ్చుకున్నట్టుగా ఉంది. అసలుసిసలు విత్తనాలకు నకిలీ విత్తనాలకు మధ్యతేడాతెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దేశంలో ఎక్కడ చూసినా నకిలీవిత్తనాల వార్తలే వినిపిస్తున్నాయి. రైతులు ఎంతోమంది వాటి ప్రభావంతో వేరే దారిలేక ఆత్మహత్య లకు దిగుతున్నారు. దేశంలో 500 పైబడి ఉన్న విత్తన కంపెనీలు సాలీనా ఐదువేల కోట్ల రూపాయల విలువచేసే నకిలీ విత్తనాలను రైతులకి అంటగట్టగలుగు తున్నారు. సాధారణంగా జరిగే విత్తనాల సాగుకే బోలెడంత ఖర్చవు తుంది. తీరా ఖర్చుతడిసి మోపెడయ్యాక కానీ అవి నకిలీ వని తెలియదు. అప్పుడు రైతు లబోదిబో అని గుండెలు బాదుకుంటాడు. నకిలీ విత్తనాలు తారసిల్లినపుడల్లా ఇలాం టి పరిస్థితే. ఇలాంటి విత్తనాలతో దేశవ్యాప్తంగా విత్తన వ్యాపార సంస్థలు 71వేల కోట్ల రూపాయలు మేరకు వ్యాపారం చేస్తున్నాయి. కొత్తగా రైతునుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం, ముసాయిదా విత్తన బిల్లు 2025 ను ప్రవేశపెట్టింది. 1966 విత్తన చట్టాన్ని (Seed Act) కొన్ని మార్పులు చేర్పులతో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త విత్తన బిల్లు రూపు దిద్దుకోనుంది. అయితే ఇది ఎంతవరకు రైతు కు ఉపయోగకారిగా ఉంటుందో తెలుసుకోవడం కోసం మొన్నడిసెంబరు 11వరకు రైతుల సూచనల కోసం ప్రభు త్వం సమయం ఇచ్చింది. రైతు సంఘాలు కూడా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసా యి. కానీ ఈ బిల్లులోని అంశాల్ని పరిశీలించిన వామపక్ష రైతాంగ సంఘాలు కార్పొరేటర్లకు మాత్రమే అనుకూలం గా ఉన్నట్లు బహిరంగంగానే చెప్పాయి. ఈ ముసాయిదా విత్తనాల బిల్లు చట్ట రూపం దాలిస్తే అంతకు ముందున్న విత్తన చట్టాలు (Seed Act) దాటి ఉంటుంది. కొత్తగా వచ్చేచట్టం నాణ్య మైన విత్తనాలు సరఫరా మరింతగా మెరుగుపరుస్తుందని, ప్రధానంగా విత్తన వాణిజ్యంలో తీసుకోదగిన అన్ని జాగ్రత్తలు ఇందులో పొందుపరిచేందుకు ఉద్దేశించబడిన బిల్లు ఇది. సాధారణ సాగుదారులకు ఈ చట్టం పెద్దగా ఉపయోగించదని, విత్తన కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుందన్న అపోహల్ని తీర్చేవిషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎలాఉందో తెలియాలి. నకిలీ విత్తనా లు విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకుంటే తప్ప వారు మారరు. విత్తనాలు వేసి పంట నష్టపోయిన రైతు లకు పరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్క పెడుతున్నాయి. ఎవరైతే నకిలీ విత్తనాలు అంట గట్టారో వారి నుంచే పరిహారాన్ని రాబట్టే ప్రక్రియ చాలా అవసరం. విత్తనసంస్థలపై ఇటువంటి ఆర్థిక భారం పడుతుందన్న విషయం అమలులో ఉందని తెలిస్తేనే వారు రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టరు. లేకుంటే వారి ఇష్టారాజ్యం. విత్తన విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రం లేక పోవడం కూడా ఒక లోపం. అందుకే రైతుకు అందే విత్త నాల నియంత్రణపై వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణ ఉండడం అవసరం. నకిలీ విత్తనాల విక్రయ నేపథ్యంలో విత్తనాలు కృత్రిమ కొరతకు పాల్పడే వ్యవస్థలు, వ్యక్తులు కూడా తమ కార్యకలాపాలను వారు నిర్వహిస్తుంటారు. వాటిపై ప్రభుత్వం నిరంతరం కన్నేసిఉంచాలి. అలాంటి కంపెనీలను నిషేధించాలి. రైతులు సాంప్రదాయ పద్దతి లో
విత్తనాలుపోసుకునే రైతుకు కూడామరిన్ని ప్రోత్సాహ కాలు ఇవ్వటం అవసరం. అలా కాకుండా విత్తన చట్ట సవరణ పేరిట ఎన్ని చట్టాలు తెచ్చినా ఉపయోగంలేదని రైతు సంఘాల వ్యాఖ్యానం. సంయుక్త కిసాన్ మోర్చా వంటి సంస్థలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బహుళజాతి కార్పొరేట్ విత్తన సంస్థలకు మాత్రమే ఈ బిల్లు మేలుచేస్తుందని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రేపటి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఈ బిల్లు చట్ట రూపం దాల్చేందుకు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతాయో చూడాలి. ఈ ముసాయిదా చట్టం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ముప్పు కలిగిస్తుందని, అంతేకాక రైతులు విత్త నాల కోసం ప్రైవేటు కంపెనీలపై ఆధారపడాల్సివస్తే భవి ష్యత్తులో స్వయంగా విత్తనాలను తయారుచేసుకునే వారి హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆల్ ఇండియాకిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ థావలే అభిపాయపడుతున్నారు. తదుపరి పంట కోసం విత్తనాలు నిల్వచేసుకునే సాంప్రదా యాన్ని పంజాబ్ రైతులు పాటిస్తుంటారు. రేపేపుడో విత్తన హకులను కార్పొరేట్లకు ధారపోస్తే రైతు బాగా నలిగిపో తాడని పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో పరీక్షించి విడుదల చేసే ఏవిత్తన రక మైనా రాష్ట్రానికిగల ప్రత్యేక వ్యవసాయ వాతావరణ పరి స్థితుల్లో తప్పనిసరిగా వాడవలసివస్తే రైతుకు నష్టం కలుగుతుంది. అందుకే ఇది న్యాయపరమైన విత్తనచట్టం కాదని రైతు సంఘాలు ఘోషిస్తున్నాయి. రైతులకు చట్ట బద్ధమైన పరి హారవ్యవస్థను రూపొందించాలని వారుకోరు తున్నారు. ఎన్నిసార్లు వ్యవసాయ చట్టాల సంస్కరణలకు తలపెట్టిన బిల్లులు రైతుల అభ్యంతరాలతో చట్టాలుగా రూపు దిద్దుకోలేదు. 1966 విత్తన చట్టం, అటుపై 1983 లో వచ్చిన విత్తన సవరణ కూడా అదే మాదిరి ఆగిపో యింది. ఈసారి పరిస్థితి అలాగే ఉంది. పెద్ద పెద్ద విత్తన కంపెనీలకే కొత్త విత్తన చట్టంకాపు కాస్తుందనీ, తక్షణ పరిహార లబ్దిదొరకని చిన్నరైతు మరింత చితికిపోతాడని రైతు సంఘాల ఆలోచనగా ఉంది. ఏ విత్తనచట్టంలోనైనా నకిలీ విత్తనాలతో నష్టపడిన రైతుకు తక్షణ పరిష్కారం దక్కే మార్గాన్ని సూచించమని రైతు సంఘాలు అభ్యర్థిస్తు న్నాయి. ప్రస్తుత బిల్లు వలన విత్తన రంగాన్ని కార్పొ రేట్లు హస్తగతం చేసుకుంటాయని సంయుక్త కిషన్ మోర్చా ఈ ముసాయిదా బిల్లును ఉపసంహరించుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: