అనంతపురం : హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా వచ్చే మార్చి 10వ తేది నాటికి 50 టీఎంసీలు నీటిని తీసుకురావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 44 టీఎంసీల నీరు వచ్చినట్లు హంద్రీనీవా(హెచ్ఎన్ఎస్ఎస్) హంద్రీనీవా జిల్లా ఎస్ఈ ఎ.రాజాస్వరూప్కుమార్ (SE Raja Swaroop) ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా నీటితో రాయలసీమ మరో కోస్తా కానుందని హంద్రీనీవా కాలువలకు లైనింగ్ పనులు చేయడం ద్వారా నీటిని ఎక్కువగా తీసుకొచ్చేందుకు అవకాశం ఏర్పడిందని ఈ ఏడాది కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లామని కుప్పం నియోజకవర్గం ఉన్న అన్నమయ్య జిల్లాకు 4.4 టీఎంసీల నీరు తీసుకెళ్లామని ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీనీవా ద్వారా 190 చెరువులకు నీళ్లు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ఆశయంతో ఎక్కువ నిధులు వెచ్చించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
Read also: Abhishek Sharma: ఆసుపత్రిలో చేరిన అభిషేక్.. మ్యాచు డౌట్ యే
హంద్రీనీవా కింద చేపడుతున్న వివిధ కార్యక్రమాల
మంగళవారం ప్రభాతవార్తకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హంద్రీనీవా కింద చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. హంద్రీనీవా పథకంలో భాగంగా కాలువలు లైనింగ్ పనులు చేస్తే నీటి సామర్థ్యం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా 3,850 క్యూ సెక్కుల సామర్థ్యంతో నీరు వచ్చే 0 కిలోమీటర్లు 216 కిలోమీటర్ల వరకు అంటే మాల్యాల నుంచి జీడిపల్లి వరకు లైనింగ్ పనులు చేపట్టామన్నారు. 216 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్ల వరకు 2,500 క్యూ సెక్కులతో లైనింగ్ పనులను కాలువ వెడల్పు పనులకు ప్రధాన కాలువ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
కాలువ లైనింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ప్రస్తుతం కాలువలో నీరు ఉన్నందున చేపట్ట లేదని కాలువలో నీరు ఆగిన తర్వాత టెండర్ షెడ్యూల్లో ఏఏ అభివృద్ధి పనులు పేర్కొన్నారో వాటన్నింటినీ 100కి 100 శాతం పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల లైనింగ్ పనులను 100 రోజుల్లోనే పూర్తి చేసి జులై 17 నుంచి 3,850 క్యూ సెక్కులతో నీటిని తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని హంద్రీనీవాను టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం బావిస్తోందని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
హంద్రీనీవా పథకం కింద వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు సిబ్బంది, ఇంజినీర్ల కొరత కూడా లేదని ఆయన చెప్పారు. ఈ ఏడాది హంద్రీనీవా పథకం కింద ఇప్పటి వరకు కర్నూలు జిల్లాకు 1.48 టీఎంసీలు, అనంతపురం జిల్లాలో అనంతపురం(Anantapur Lakes Filling) నుంచి జీడిపల్లి వరకు 3.8 టీఎంసీలు, మొత్తం అనంతపురం జిల్లాలో 27.5 టీఎంసీలు, శ్రీ సత్యసాయి జిల్లాకు 24 టీఎంసీలు, కుప్పం నియోజకవర్గం ఉన్న అన్నమయ్య జిల్లాకు 4.4 టీఎంసీల నీటిని తీసుకొచ్చినట్లు హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ ఎ.రాజాస్వరూప్కుమార్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: