📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu news: Scrub typhus: జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్(Scrub typhus) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో భయం పెరిగింది. మరణించిన వారు విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు టీకా లేకపోవడంతో, అప్రమత్తత మరియు ముందస్తు జాగ్రత్తలే ప్రధాన రక్షణ మార్గమని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Horticulture Hub : హార్టికల్చర్ హబ్ కు రూ. 40వేల కోట్లు ఇవ్వబోతున్న కేంద్రం – చంద్రబాబు ప్రకటన

శరీరంపై దద్దుర్లు, కాలిన గాయంలాంటి మచ్చలు, కీటకం కుట్టినట్లైన నొప్పి, అలాగే తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సొంతంగా మందులు వేసుకోవడం ప్రమాదకరమని చెబుతున్నారు. రోగిని ప్రారంభ దశలో పరీక్షించి, సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తే ప్రాణాపాయం నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ర్యాపిడ్, వైల్-ఫెలిక్స్, ఐజీఎం ఎలిసా పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.

The “scrub typhus” is spreading..The death toll has reached five.

స్క్రబ్ టైఫస్ ‘ఒరియెంటియా సుట్సుగముషి(Orientia Tsutsugamushi)’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది నల్లిని పోలిన ‘చిగ్గర్ మైట్’ కీటకం కాటు ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుండి మరొకరికి నేరుగా సంక్రమించదు. ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఈ కీటకాల పెరుగుదల ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ కూలీలు, గడ్డి మైదానాల్లో పనిచేసేవారు, బయట ఆడుకునే పిల్లలకు ప్రమాదం ఎక్కువ.

వ్యాధి నివారణ కోసం చేయాల్సినవి

  1. ఇంటి చుట్టుపక్కల, పశువుల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి
  2. గడ్డి, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను తరచూ శుభ్రం చేయాలి
  3. రాత్రిళ్లు బయట నేలపై నిద్రించకూడదు
  4. ఇంట్లో ఎలుకలు, కీటకాలు రాకుండా చర్యలు తీసుకోవాలి
  5. పాత మంచాలు, ఫర్నిచర్‌ను తరచూ శుభ్రం చేయాలి
  6. పరుపులు, దుప్పట్లు బాగా దులిపి ఉపయోగించాలి
  7. పిల్లలు, పెద్దలు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి
  8. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh health alert AP Disease Outbreak AP Medical Department Chigger Mite Infection Fever Symptoms Scrub Typhus

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.