SCR: 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

Read Time:  1 min
SCR: 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం
FONT SIZE
GET APP

హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు 52 సంవత్సరాలుగా నిరంతరం సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. 2025 సంవత్సరానికి బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు ఈ ట్రైన్‌కు లభించిందని, సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారికంగా ప్రకటించింది. 1974లో ప్రారంభమైనప్పటి నుండి ఈ రైలు తరాలుగా ప్రయాణికుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని (SCR) ట్వీట్ చేసింది.

Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ప్రపంచంలోనే భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని కలిగిన రెండో ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వేలు కొన్నేళ్లుగా ఎన్నో మార్పులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత మారిన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కేంద్రం కూడా రైల్వేల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇందులో నుంచి పుట్టుకొచ్చినవే వందేభారత్, అమృత్ భారత్ వంటి ప్రీమియం రైళ్లు. అయితే ఎన్ని రైళ్లు వచ్చినా ఇంకా అర్ధ శతాబ్దంగా రాకపోకలు సాగిస్తున్న అరుదైన రైళ్లు ఎన్నో ఉన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.