📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

SBI Robbery : 11 కేజీల 400 గ్రాముల బంగారం చోరీ – ఎస్బీఐలో 10 కోట్లకు లెక్కలు

Author Icon By Shravan
Updated: July 30, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిందూపురం : దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న హిందూపురం తూముకుంటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీ (SBI Robbery) ఘటనలో మొ త్తం బంగారు ఆభరణాలు 11 కేజీల 400 గ్రాములు చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారులు లెక్కలు తేల్చారు. వీటి విలువ 13కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా నగదు రూ.37.92 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. దోపిడీ ఘటన సమాచారం వచ్చిన ప్పటి నుంచి రెండు రోజులుగా బ్యాంకు వద్ద డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. కుద వపెట్టిన బంగారు ఆభరణాలు ఒక్కోటి ఒక్కో క్యారెట్ టచ్లు ఉంటాయని కావున బంగారు ఆభరణాలు విలు వ రూ.9.57కోట్లు ఉండవచ్చని ఎఫ్ఎఆర్లో నమోదు చేశారు.

బ్యాంకు వద్ద మంగళవారం (Tuesday) డిఎస్పి విలేక రులతో మాట్లాడుతూ సేఫ్ లాకర్లో ఉంచిన భారీ నగదు బంగారు ఆభరణాలు చోరీ చేసిన దుండగులు లాకర్ దిగువ భాగంలో ఉన్న మరో పెట్టెను తేరిచేందుకు విఫలయత్నం చేశారని చెప్పారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచేందుకు ప్రయత్నించిన అది అందకపోవడంతో ఫలితం వారికి దక్కలేదన్నారు. దీనివల్ల ఈ లాకర్లో ఉన్న మరో 10 కేజీల బంగారం చోరీకి గురికాకుండా కాపాడబడిందని చెప్పారు. ఇదిలా ఉండగా దోపిడీ కావడానికి బ్యాంక్ అధికారుల నిర్లక్షమే కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రెండు నెలల కిందట సిఐ బ్యాంకు ను పరిశీలించినప్పుడు డైనింగ్ హాల్కు అనుకుని ఉన్న కిటికీని భద్రత దృష్ట్యా మూసి వేసి గోడ కట్టాలని సూచించారు. ఆ కిటికీలోంచి దొం గలు సునాయాసంగా బ్యాంకులో చొరబడే ప్రమాదం ఉందని సిఐ హెచ్చరించారు. అయినప్పటికీ బ్యాంక్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరి గింది. అంతేకాకుండా నాలుగేళ్లుగా సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం గమనార్హం.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Fertility Center : యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రానికి తాళాలు

10 Crore Scam Bank Fraud Breaking News in Telugu Crime News Gold Theft Latest News in Telugu SBI Robbery Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.