📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Savitribai Phule: సావిత్రిబాయి పూలే జయంతి.. ప్రముఖులు నివాళులు

Author Icon By Anusha
Updated: January 3, 2026 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదిక X (Twitter) లో స్పందిస్తూ, మహిళలను విద్యావంతులుగా చేయాలనే లక్ష్యంతో ఆనాడు సమాజ కట్టుబాట్లను ధిక్కరించి ఆమె చేసిన సాహసం నేటి ఆధునిక మహిళా శక్తికి బలమైన పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు.సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం మహిళల విద్యకే పరిమితం కాకుండా, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు.

Read also: Indrakeeladri: దుర్గమ్మ దర్శనం.. వీఐపీలకు ఇక టికెట్ తప్పనిసరి

ఘన నివాళులు

ఆమె చూపిన దారిలోనే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు.సమాజంలో సగభాగమైన మహిళల విద్యాభివృద్ధిలో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తు చేశారు. అందుకే ఆధునిక మహిళలు ఆమెకు సదా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా విద్యకు వెలుగులు నింపిన సావిత్రిబాయి పూలేకు మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్‌లో తెలిపారు. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

సావిత్రిబాయి పూలే మన దేశ మొట్టమొదటి మహిళా టీచర్ అని, స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తిమంతమైన సాధనంగా భావించారన్నారు. సామాజిక వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారని, నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె మార్గదర్శి అనీ అన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అని లోకేశ్ పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Chandrababu Naidu latest news Nara Lokesh savitribai phule Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.