📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు

Savitribai Phule Jayanti : సావిత్రిబాయి పూలే జయంతి, చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు | మహిళా విద్యకు స్ఫూర్తి

Author Icon By Sai Kiran
Updated: January 3, 2026 • 8:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Savitribai Phule Jayanti : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన Savitribai Phule జయంతి సందర్భంగా Nara Chandrababu Naidu ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆనాడు సమాజంలోని కట్టుబాట్లను ఎదురించి సావిత్రిబాయి చేసిన పోరాటం, నేటి మహిళా శక్తికి బలమైన పునాదిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

సావిత్రిబాయి పూలే మహిళల విద్యకే కాదు, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకువచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆమె చూపిన మార్గంలోనే నేటి మహిళలు రాజకీయాలు, విద్య, సైన్స్‌, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

సమాజంలో సగభాగమైన మహిళల అభివృద్ధిలో (Savitribai Phule Jayanti) సావిత్రిబాయి పూలే పాత్ర అమూల్యమని సీఎం గుర్తు చేశారు. మహిళా విద్యకు వెలుగులు నింపిన ఆమెకు ఆధునిక మహిళలు సదా కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళా విద్యా వికాసానికి ఆమె చేసిన సేవలను స్మరిస్తూ మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చంద్రబాబు తన సోషల్ మీడియా సందేశంలో తెలిపారు.

ఇదే సందర్భంగా మంత్రి Nara Lokesh కూడా సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించారు. సావిత్రిబాయి మన దేశంలో తొలి మహిళా టీచర్ అని, స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం ఆమె జీవితాంతం అంకితభావంతో పనిచేశారని లోకేశ్ కొనియాడారు.

ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనంగా భావించిన సావిత్రిబాయి, తీవ్ర వ్యతిరేకతలు, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారని ఆయన తెలిపారు. నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె ఒక ఆదర్శమని పేర్కొంటూ, సావిత్రిబాయి పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అని లోకేశ్ అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh leaders tribute Breaking News in Telugu Chandrababu Naidu Savitribai Phule First woman teacher India Google News in Telugu Latest News in Telugu Nara Lokesh tribute Savitribai Phule anniversary Savitribai Phule Jayanti Savitribai Phule tribute social reformer Savitribai Phule Telugu News women education India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.