📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Savita: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి

Author Icon By Saritha
Updated: October 18, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రిన్సిపాళ్లతో జూమ్ కాన్ఫరెన్స్ లో మంత్రి సవిత

విజయవాడ : బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కంటికి రెప్పల్లా, సొంత బిడ్డల్లా చూసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత (Savita) స్పష్టం చేశారు. రోజూ కురుస్తున్న వర్షాలు, మారు తున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆప్రమత్తంగా ఉండాలని, వారానికోసారి సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్యులతో పిల్లలకు ఆరోగ్య (Health) పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు ప్రతి రోజూ హాస్టళ్లను సందర్శించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో మంత్రి సవిత శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్టళ్లలో పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల నిర్వహణలో నిరక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు వేడి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలన్నారు. వసతి గృహాల వరిసరాలను, మరుగుదొడ్లు, బాత్ రూమ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాల న్నారు. హాస్టళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా స్థానిక సంస్థల సాయంతో ఫాగింగ్ చేయించాలని మంత్రి ఆదేశించారు.

Read also: పండగ రద్దీతో నిలువున దోచుకున్న క్యాబ్ డ్రైవర్లు

Savita: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి

దురదృష్టకర ఘటనలకు తావివ్వొద్దు

ప్రస్తుతం రాష్ట్రంలో కొన్న సంక్షేమ హాస్టళ్లలో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వార్డెన్లు నిరంతరం ఆప్రమత్తంగా ఉండాలని మంత్రి నవిత దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా, కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. వారానికోసారి హాస్టళ్లకు సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు(Savita) చేయించాలన్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యాధికారితో వైద్యమందిం చాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు తరలించాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. హాస్టళ్లలో విపత్కర పరిస్థితులు తలెత్తగానే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారమివ్వాలన్నారు. అన్నపుర్రు బీసీ హాస్టల్ వంటి ఘటనలు పునరావృతం కానివ్వొద్దన్నారు..

రోజూ తనిఖీ ఫొటోలు పంపండి.

డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, కో ఆర్డినేటర్లు రోజూ తమ పరిధిలో ఉన్న బీసీ హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను సందర్శించాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. సందర్శించిన కో ఆర్డినేట్ ఫొటోలతో తనిఖీ నివేదికలను వాట్సాప్ గ్రూప్లో పొందుపర్చాలన్నారు. హాస్టళ్ల నిర్వహణలో వార్డెన్లు, డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, కో ఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, లక్ష్యసాధనలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

వంద శాతం ఫలితాలే లక్ష్యం..

రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు రావాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులతో ప్రేమ పూర్వకంగా మెలుగుతూ, విద్యపై ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చూడాలన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో బీసీ సంక్షేమ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ కార్యదర్శి మాధవీలత, వివిధ జిల్లాలకు డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, హాస్టల్ వార్డెన్లు కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Andhra Pradesh Hostels BC welfare Breaking News in Telugu Latest News in Telugu Minister Savitha Student Health Checkups Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.