Save Punarvika: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను కదిలించిన చిన్నారి పునర్విక ఉదంతం సుఖాంతమైంది. 11 నెలల వయసులోనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న పునర్విక ప్రాణాలను కాపాడేందుకు తెలుగు ప్రజలు కదిలివచ్చారు. చికిత్సకు అవసరమైన భారీ మొత్తాన్ని సేకరించేందుకు చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ మహాయజ్ఞంలా సాగి విజయవంతమైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Read Also: Malla Reddy-Supreme Court: సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి చుక్కెదురు
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి కుమార్తె పునర్వికశ్రీకి అరుదైన కోట్లలో ఒకరికి వచ్చే ఎస్‌ఎమ్‌ఏ టైప్ 1 (SMA Type-1) వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఇంజెక్షన్ రూ.16 కోట్లు అవుతుందని చెప్పారు. పేద కుటుంబానికి చెందిన సురేష్‌కుమార్ అంత డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వాన్ని, అధికారుల్ని కలిసి సాయం చేయమని కోరారు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. విరాళాలు సేకరించి చిన్నారికి అవసరమైన డబ్బుల్ని సమకూర్చారు.
విరాళాలు ఆపండి.. పాప తండ్రి సురేశ్ భావోద్వేగ విజ్ఞప్తి
ఈ పిలుపునకు యువత, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ‘ట్రావెల్ విత్ జగదీష్’ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కరే రూ.కోటిన్నరకు పైగా సేకరించడం విశేషం. ఇలా ప్రజల నుంచి మొత్తం రూ.8.53 కోట్లకు పైగా విరాళాలు అందగా, ప్రభుత్వ సాయంతో కలిపి చికిత్సకు కావాల్సిన నిధులు సమకూరాయి.ప్రస్తుతం పాప ఆసుపత్రిలో ఉందని, నాలుగైదు రోజుల్లో ఆమె ఆరోగ్యం, చికిత్స వివరాలపై పూర్తి అప్‌డేట్ ఇస్తానని సురేశ్ కుమార్ తెలిపారు. చికిత్సకు అవసరమైన దానికంటే ఎక్కువగానే నిధులు అందాయని, మిగిలిన డబ్బును తనలాగే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారుల వైద్యానికి అందిస్తానని ఆయన ప్రకటించడం అందరినీ కదిలించింది. వాస్తవానికి ఇంజెక్షన్ ఖర్చు కూడా అంచనా వేసిన దానికంటే తక్కువగా, సుమారు రూ.10 కోట్ల లోపే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: