📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Road accident : సౌదీలో చిదిమేసిన రోడ్డు ప్రమాదం!

Author Icon By Sudha
Updated: November 19, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అవాంఛనీయ సంఘటనలు, అనుకోని దుర్ఘట నలు ఎదురైతే ఇక మిగిలేది శోకమే. ప్రమా దాలు జరిగి కుటుంబ సభ్యులు యావత్తూ మరణించినా, ఆ కుటుంబానికి సాన్నిహిత్యమున్న వారు మరణించినా ఇంటిల్లిపాదీ శోకసముద్రంలో మునిగిపోతే ఆ సన్నివేశాలు గమనించిన వారెవరికైనా హృదయం ద్రవించక మానదు. సంఘటన స్థలం సౌదీ అరేబియా. మక్కా నుంచి మదీనా మార్గమధ్యంలో ముష హరత్ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి 1.30 ప్రాం తంలో డీజిల్ ట్యాంకరు ఢీకొన్న బస్సొకటి 45 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఆ ప్రమాదంలో వారంతా అగ్నికీలలకు సజీవ దహనమయ్యారు. వారిలో ఇద్దరు కర్ణాటక వాసులూ మృత్యువాతపడ్డారు. ప్రయా ణికులందరూ భారతీయులే. అదీ ముఖ్యంగా దాదాపు అందరూ మక్కా యాత్రికులే. దైవ సన్నిధానికి వచ్చిన వారు తాము తొక్కిసలాటలో చనిపోతామనో, తాము ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదాలకు గురవుతుందనో అనుకుని బయలుదేరరు. అపశకునం మాటలు మాట్లా డుకోకుండా ఆ దైవం దివ్యానుగ్రహంతో తీర్థయాత్రలకు శ్రీకారం చుడతారు. కానీ విధి మరోలా జీవితాలతో ఆటలాడుకుంటోంది. భక్తి భావం నిండుగా గుడులు, గోపురాలు, మసీదులకు వెళ్తే అక్కడ అనుకోని తొక్కిసలా టలు ఎదురు చూస్తుంటాము. పరాయివ్యక్తిని నమ్మితే మోసం కాటేస్తుంది. ఎన్నో ఆధునిక సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్నా అప్రమత్తంగా ఉన్నా, అనుకోని అవాంతరాలు, అంతరాయాలు, చివరికి ఎలా వెళ్లి ఎలా ఇళ్లు చేరుతామో అంచనాకందదు. అయినా అనుకున్నట్లు గా అంతా జరుగదు. సౌదీ దుర్ఘటనలో బుగ్గిపాలైన వారి మృతదేహాలు గుర్తుపట్టేందుకు కూడా మిగల్లేదు. వారిని గుర్తించాలంటే డిఎన్ఎ టెస్టుల వల్లే సాధ్యం. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు హైదరాబాద్ నుంచి 54 మంది బయలుదేరారు. వారిలో 8 మంది అదృష్ట వశాత్తూ మక్కాలో ఆగిపోయారు. అదే వారికి అదృష్టా నికి దారి చూపింది. బస్సు ఎక్కలేకపోయారు. వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. బస్సెక్కిన వారంతా మృతజీవులే. ఒక్కరంటే ఒక్కడే మృత్యుంజయుడిగా మిగిలారు. చెప్పాలంటే హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం తమ మూడుతరాలు వ్యక్తుల్ని కోల్పోయింది. ఆ ఇంటి పెద్ద నసీరుద్దీన్, ఆయన భార్యతో సహ 8 మంది పెద్దలు, పది మంది మనవలు, మనవరాళ్లు దుర్మరణం పాలయ్యారు. చితిలో భస్మాన్ని డిఎన్ఎకి పంపిన తర్వాతే వారెవరో గుర్తించగలిగేది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం అత్యంత విషాదకర సంఘటన. ఎవరికైనా మనసు కలచివేస్తుంది. మక్కా యాత్రే తమ అంతిమ ఆఖరి మజిలీయని వారు అనుకొని ఉండరు. ఈ మధ్యకాలంలో తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు, ఘోరరోడ్డు ప్రమాదా లు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే కలికాలం వచ్చేసింద నుకునే రోజుల్ని చూస్తున్నాము. అందుకే ఎన్నడూలేని దుస్సంఘటనలను ప్రతిరోజూ చూస్తున్నామా? అనిపిస్తుం ది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం ప్రమాదకర మని అన్నివేళలా హెచ్చరిస్తూనే ఉన్నా జరుగరాని విషా దాలు జరిగిపోతూనే ఉన్నాయి. భారతదేశంలో జరిగే ప్రమాదాలకే మనం బెంబేలెత్తిపోతున్నాం. అతివేగం, అమిత నిర్లక్ష్యం పేరిట ఇచ్చే నినాదాలు వ్యర్ధమైపోతున్నాయి. ముఖ్యంగా అర్థరాత్రి ప్రయాణాల్లో ఎక్కువ ప్రమా దాలు జరిగేవి నడిరోడ్డు మీదనే, చీకటిలోనే. ఆ సమ యానికి బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలోనే ఉంటా రు. నిద్రలోనే గాల్లో కలిసిపోయే ప్రయాణీకులు ప్రాణాలు ఎన్నో. భారత కాలమానం ప్రకారం సౌదీలో ప్రమాదం జరిగిన సమయం సోమవారం తెల్లవారుఝాము. డీజిల్ ట్యాంకరు ఢీకొని బస్సుకు నిప్పంటుకోగానే బస్సులోని 45 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఆ సమయానికి అందరూ నిద్రలోనే ఉన్నారు. 2019లో ఒకబస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొని 35మంది, 2023 నుంచి మక్కా నుంచి వెళ్తున్న మరో బస్సు బ్రిడ్జిని ఢీకొట్టగా మంటలో చిక్కుకోగా 20 మంది మృత్యువాతపడ్డారు. నెలరోజుల క్రితం కర్నూలు శివారుల్లో ప్రైవేటు బస్సు మోటారు సైకిల్ను ఢీకొనగాగా రేగిన అగ్ని జ్వాలాలలకు ప్రయాణికులు పూర్తిగా దగ్గమయ్యారు. 15 రోజుల్నాడు చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని (Road accident)మరచిపోలేము. బస్సు డ్రైవర్ ఏమరుపాటుగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని విశ్లే షిస్తున్నా అతనిప్పుడు బతికిలేడు. కనుక నిజాలు తెలియవు. నిజానికి భారతీయ రోడ్లపై (Road accident) ప్రమాదాలకు, సౌదీలో రోడ్లకు మధ్య జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషించాలంటే సాపత్యం ఉండదు. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ చెబుతున్న దానిని బట్టి మక్కాలో బస్సులు, కార్లు గంటకు 180కి.మీ వేగంలో వెళ్తుంటాయి. అదే నిజమైతే అతివేగం నుంచి కట్టడి సాధ్యం కాదేమో. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఏ దేశంలోనైనా అతివేగాన్ని అరికట్టడం అత్యంత అవసరం. ప్రతి ముస్లిం తమ జీవితకాలంలో ఒకసారైనా మక్కా యాత్రకు వెళ్లిరావాలని తలపోస్తారు. ఈ యేడాది తెలంగాణ నుంచి 9వేల మందికిపైగా మక్కాకు బయలుదేరా రు. నాలుగు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు వారి ప్రయాణపు ఏర్పాట్లు చూసాయి అనీ సజావుగానే జరిగాయి. కానీ ఊహించని ప్రమాదానికి విగత జీవులౌతారని ఎవరూ అనుకొని ఉండరు. అందులో ప్రయాణించిన వారు హైదరా బాద్లోని 8 కుటుంబాలకు చెందినవారు. కుటుంబ పెద్దలు కోల్పోయిన వారూ ఉన్నారు. అలాంటి కుటుంబా ల ఆలనా పాలనా చూసుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అవసరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Fatal Accident latest news Middle East News Road Accident Saudi Arabia Telugu News Traffic incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.