📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

capital punishment : ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

Author Icon By Sudha
Updated: January 8, 2026 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినిమా అభిలాషలో అమాయకుడికి శిక్ష పడకూడదనే సందేశం ఇస్తారు మెగాస్టార్ చిరంజీవి. స్టాప్ అనే అరుపుతో ఉరిశిక్ష ఆగిపోవడం అనేది మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ పెద్ద పెద్ద నేరాలకు ఇస్లామిక్ దేశాల్లో ఉరిశిక్షలు సర్వసాధారణం. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో వందలాది ఉరిశిక్షలు అమలవుతుంటాయి. 2025లో సౌదీ రికార్డు స్థాయిలో 356 మందికి ఉరిశిక్ష (capital punishment)ల్ని అమలు చేసింది. ఒకే ఏడాదిలో మరణశిక్షలకు గురైనఖైదీల విషయంలో సౌదీ రికార్డ్ సృష్టించింది. ఉరిశిక్షల పెరుగుదలకు ప్రధాన కారణం మాదకద్రవ్యాలపై యుద్ధం అనిఅక్కడి నిపుణులు చెబుతున్నారు. మొదటిసారిగా అరెస్టయిన వారిలో కూడా చాలామంది ఇప్పుడు ఉరిశిక్షలు ఎదురొఒంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2025లో కేవలం డ్రగ్స్ సంబంధిత కేసుల్లోనే 243 మం దికి ఉరిశిక్ష విధించారు. 2024లో సౌదీ ౩౩౮ మందికి ఉరి శిక్ష (capital punishment)విధించింది. సుమారు మూడు సంవత్సరాల పాటు మాదకద్రవ్యాల కేసులలో మరణశిక్షను నిలిపివేసిన తర్వాత, సౌదీ అరేబియా 2022లో మాదకద్రవ్యాల నేరాలకు ఉరిశిక్ష లను తిరిగి ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకా రం అరబ్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన సౌదీ అరేబియాలోకి క్యాప్టగాన్ అనేఅక్రమ ఉత్ప్రేరకానికి అతిపెద్ద మార్కెట్ ఉంది. ముఖ్యంగా సిరియా నుంచి ఇది సరఫరా అవుతుంది. మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రారంభించినప్పటి నుండి, దేశం హైవేలు, సరిహద్దు క్రాసింగ్ వద్ద పోలీసు తనిఖీ కేంద్రాలను పెంచింది. ఈ తనిఖీల్లో మిలియన్ల కొద్దీ మాదక ద్రవ్యాల మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి డజన్ల కొద్దీ స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఇలా పట్టు బడుతున్నవారిలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు.

Read Also: http://Himachal Pradesh: రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

capital punishment

విచ్చలవిడిగా ఉరిశిక్షలు

ఖైదీల్లో ప్రవర్తన మార్చడానికి బదులు ఇలా విచ్చలవిడిగా ఉరిశిక్షలు అమలు చేయడం సౌదీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆధునిక దేశంగా మారాల ని భావిస్తున్న సౌదీ అరేబియాకి ఇది విరుద్ధమని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉరిశిక్షల అమలు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 సంస్కరణల ఇమేజ్ను దెబ్బతీస్తుందని విదేశీ నిపుణులు అంటున్నారు. శాంతి భద్రతలను కాపాడటానికి మరణశిక్షలు అవశ్యం అని అక్కడి పాలకులు చెబుతున్నారు. భారతదేశం లో అత్యాచారం చేసినవారికి కూడా మరణశిక్షలు విధించడం చాలా అరుదు. అత్యాచారం చేస్తే మహా అయితే జైలు శిక్ష వేస్తారు అనే చులకన భావంతో కొంతమంది మూర్ఖులు రెచ్చిపోతున్నారు. అలా కాకుండా అత్యాచారానికి కూడా మరణశిక్ష లాంటి వాటిని అమలు చేస్తే తప్ప సమాజంలో విప్లవాత్మకమయిన మార్పు రాదంటున్నారు. కొన్ని దేశాలు అత్యాచారాన్ని తీవ్ర నేరంగా పరిగణించి ఉరి శిక్షను అమలు చేస్తున్నాయి. అమెరికాలో అయితే అత్యాచార నిందితులకు గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తే మాత్రం మరణశిక్ష విధిస్తారు. రష్యాలో అయితే నిందితులకు 4 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. ఇటు వంటి కేసులలో అరెస్టయిన వారికి 20సంవత్సరాల వరకూ ఎటువంటి ఉద్యోగమూ ఇవ్వరు. ఈ విధమైన శిక్షల వల్ల నేరం చేయాలంటే భయపడే పరి స్థితి ఏర్పడుతుంది. టెక్నాలజీలో ఎంతో ముందున్న. జపాన్ లో అయితే అత్యాచారం చేస్తే 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అత్యాచారంతో పాటు దోపిడీ కూడా చేస్తే మాత్రం మరణ శిక్ష ఖాయం. నార్వేలో మరణశిక్షలుండవు. ఇక్కడ నిందితుల కు 4నుంచి 15 ఏళ్ల కఠినశిక్ష విధిస్తారు. నెదర్లాండ్స్లో బహిరంగంగా కిస్ చేస్తే కఠిన శిక్షలు అమలుచేస్తారు.

నిబంధనల్ని ఉల్లఘిస్తే ఉరిశిక్ష

నిబంధనల్ని ఉల్లఘించి ప్రవర్తిస్తే అత్యాచారంగా భావించి 4 నుంచి15 ఏళ్ల శిక్ష విధిస్తారు. బంగ్లాదేశ్లో అయితే నింది తులకు జీవిత ఖైదు విధిస్తారు. కొన్ని అసాధారణ, అరుదైన పరిస్థితు ల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తారు. యూఏఈ లో నిందితుడికి 7 రోజుల్లోనే మరణశిక్షను అమలు చేస్తారు. బాధితులు అంగీకరిస్తే తప్ప శిక్ష నుంచి తప్పించుకోవడం కష్టం. మన పొరుగున ఉన్న పాకిస్థాన్ గ్యాంగ్ రేప్, పిల్లలపై అత్యాచారం కేసులకు మరణశిక్ష విధిస్తారు. ఫ్రాన్స్ దేశంలో బాధితురాలు మరణిస్తే 30 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధిస్తారు. తక్కువలో తక్కువగా 15ఏళ్ల శిక్షవిధించడం ఖాయం. ఇజ్రాయిల్ దేశంలో అయితే ఏవిధమైన లైంగిక నేరంచేసినా 16ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. క్యూబా దేశంలో శిక్షలు ఘోరాతిఘోరంగా ఉంటాయి.అత్యాచారం కేసులో ఇరుక్కొని మరోసారి అత్యాచారం చేసినా లేదా 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేసినా ఉరిశిక్ష వేస్తారు. అయితే ప్రపంచంలో అనేక దేశాలు ఉరిశిక్షను రద్దుచేశాయి. ఆ జాబితాలో పోర్చుగల్, నెదర్లాండ్స్, డెన్మార్క్, బెల్జియం, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్, హంగేరీ, రొమేనియా, వెనిజులా, అర్జెంటీనా, పరాగ్వే, కెనడా,కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, మొజాంబిక్, ఆంగ్ల, కంబోడియా, సైప్రస్, జింబాబ్వేలు ఉరి శిక్షకు చరమగీతం పాడాయి. అన్నినేరాలకు మరణశిక్షను రద్దు చేసిన మొదటి దేశం వెనిజులా. 1863లో ఉరిశిక్ష రద్దుచేస్తూ వెనిజులా ప్రభుత్వం నిర్ణయించింది. బ్రెజిల్, ఫిజీ, పెరు, కెన్యా వంటి దేశాలు సాధారణ నేరాలకు మాత్రమే మరణ శిక్షను రద్దుచేశాయి, సైనిక నేరాలకు ఉరిశిక్షను అమలుచేస్తు న్నాయి. కొన్నిదేశాలు చట్టంలో మరణశిక్ష ఉన్నప్పటికీ, కనీ సం 10సంవత్సరాలుగా అమలు చేయడంలేదు. 2021 చివరి నాటికి 108 దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి. ఇది ప్రపంచ దేశాలలో మూడింట రెండు వంతుల కంటే
ఎక్కువని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
-జి. సత్యనారాయణరాజు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Capital Punishment death penalty Executions Human Rights latest news Saudi Arabia Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.