📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Satyakumar Yadav: వైద్య సిబ్బంది తీరు మారాలి

Author Icon By Saritha
Updated: December 31, 2025 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయం : సమగ్ర ప్రజారోగ్య భద్రత సాధనకు వైద్యులు, ఇతర సిబ్బంది తీరు మారాలని, దీంతో పాటు (Satyakumar Yadav) ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలిలో సమగ్ర మార్పు రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ దిశగా అందరూ నూతన సంవత్సరం సందర్భంగా సంకల్పం తీసుకోవాలని మంత్రి విజప్తి చేశారు. వైద్య సిబ్బందికి, ఏపీ (AP) రాష్ట్ర ప్రజలకు మంత్రి నూతన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఈ లక్ష్య సాధనకు ప్రజల పూర్తి భాగస్వామ్యం కీలకమని మంగళవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Read also: AP: ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

The attitude of the medical staff must change.

వ్యాధులను అరికట్టడానికి సమగ్ర జీవనశైలి మార్పు

వ్యక్తిగత పరిశుభ్రత, నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని మంత్రి కోరారు. వేగంగా విస్తరిస్తున్న మధుమేహం (బ్లడ్ షుగర్), రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమణ (నాన్ కమ్యునకబుల్ డిసీజెస్) వ్యాధులకు అరికట్టడానికి ప్రజల జీవన విధానంలో సమగ్ర మార్పుల అవసరాన్ని మంత్రి నొక్కివక్కాణించారు. (Satyakumar Yadav) ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, యోగా మరియు ధ్యానం ప్రక్రియల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రజలు దృష్టి పెట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ విజప్తి చేశారు.
ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది విధుల నిర్వహణలో వెల్లడవుతున్న కొన్ని లోపాల పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ఆశించిన ఫలితాలు రావాలంటే వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది దృక్పథాల్లో మార్పులు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గత 19 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలతో కొంత మార్పు స్పష్టంగా వచ్చిందని, ఈ మార్పును మరింత విస్తృతంగా, లోతుగా సాధించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకనుగుణంగా అందరూ సమిష్టి కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ విజప్తి చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP Health Minister Doctors Conduct Healthcare Awareness Latest News in Telugu Non-Communicable Diseases public health Satyakumar Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.