📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:Satyakumar Yadav: ఆయుష్ బలోపేతం – కేంద్రం నుంచి రూ.166 కోట్లు మంజూరు

Author Icon By Pooja
Updated: October 11, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖను(AYUSH Department) పటిష్ట పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య, కుటుంబ ఆంక్షేమం శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Satyakumar Yadav). శుక్రవారం స్థానిక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్స్ స్టైఫండ్స్ ఆంచినందుకు మంత్రి సత్యకుమార్ యాదవుకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయుష్ శాఖను ఆదర్శంగా చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్థుల పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ పెంచిందన్నారు. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధి కార్యక్రమాల కోసం ద్రం రూ.166 కోట్లు మంజూరు చేసిందన్నారు.. ధర్మవరం, కాకినాడలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు ౦జూరు చేశామన్నారు. గత ప్రభుత్వం ఆయుష్ -ఖను పట్టించుకోకుండా నిరక్ష్యం చేసిందన్నారు. ద్రానికి పంపించాల్సిన నివేదికలను పంపక దేవడం వల్ల మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి వాడా ఆయుష్ శాఖకు కేటాయింపు జరగలేదన్నారు.

Read Also: Tirumala: భక్తుల ఇబ్బందులపై రియల్ టైం ఫీడ్ బ్యాక్


అంతో ప్రాచీనమైన మన భారతీయ ఆయుష్, యునాని తదితర వైద్య విధానాలను
సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు.. భావితరాలకు దీని విశిష్టతను తెలియ పరిచే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఆయుష్ ప్రాధాన్యతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తించి దీనికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆయుష్ లో భాగమైన యోగా, ప్రాణాయామం వంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించారన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఆయుష్ శాఖకు చెందిన ఐదు ఆస్పత్రులను, మూడు కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.. ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్టపరిచే విధంగా బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది మొత్తం కలిపి 500 పోస్టుల నియామకాలు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ ఆయుర్వేద కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆయు ర్వేద కళాశాలలు విశాఖపట్నం, కాకినాడ లలో మంజూరు చేయడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వం పూర్తి గా ఆయుష్ శాఖను మంత్రి సత్య కుమార్ యాదవ్(Satyakumar Yadav)నిర్వీర్యం చేసిందన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే మొదటి ఏడాది రూ. 83 కోట్లు, రెండో ఏడాది 166 కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో 2018 లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ యోగా అండ్ నేచురోపతికి భూమిని కేటాయించగా, గత ప్రభుత్వం ఆ స్థలాన్ని వేరే యాక్టివిటీస్కి ఇచ్చారని, అది కూడా నెరవేం లేదన్నారు. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థను గత ప్రభుత్వం రాష్ట్రానికి రానివ్వకుండా చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతమైన ప్రత్తిపాడులో ఆ సంస్థకు భూమిని కేటాయించి, రాబోయే 2 సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా మన్నారు. దీనివల్ల ఆయుష్ అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి వచ్చి అధునాతనమైన పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

ఆయుష్ శాఖ డైరెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పీజీ విద్యార్థుల స్టైఫండ్ ను పెంచి రికార్డు సృష్టించారన్నారు. గతంతో పోల్చుకుంటే ఆయుష్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. వైద్య విద్యార్థులు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాన్ని అందిపుచ్చుకుని మందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, ఆయుష్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ పి. సాయి సుధాకర్, డాక్టర్ నోరి రామాశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ కె. నిర్మలా జ్యోతి బాయ్, ఆయుర్వేద కళాశాల కు చెందిన పీజీ, హౌస్ సర్జన్స్ పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Ayush Central Government Health Ministry Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.