📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Satyakumar Yadav-పేద విద్యార్థులంటే అంత అలుసా! మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం

Author Icon By Sharanya
Updated: September 25, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: కొత్త కళాశాలల ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. రూ.451 కోట్ల భారీ వ్యయంతో ప్యాలెస్ ను నిర్మించిన జగన్ పేద వైద్య విద్యార్థుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైద్య విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయాలన్న చిత్త శుద్దిలేని వైకాపా నేతలు పీపీపీ విధానంలో కొత్త వైద్య నిర్వహణపై అవగాహన రాహిత్యంతో, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీపీపీ (PPP)విధానం దేశవ్యాప్తంగా అమల్లో ఉందన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం రూ.8 లక్షల 44వేల కోట్ల విలువైన పనులు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద పీపీపీ విధానంలో పనులు జరుగుతున్నాయన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు అద్భుతంగా నడుస్తున్నాయని తెలిపారు.

News telugu

శాసనమండలిలో బుధవారం వైద్య కళాశాలలు… పీపీపీ విధానం అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. “పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్, ప్రైవేటీకరణ మధ్య ఉన్న తేడా తెలియని వారు సీఎంగా ఐదేళ్లపాటు పనిచేయడం మన దౌర్భాగ్యం. దురదృష్టకరం. పలు రాష్ట్రాల్లో డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ విధానంలో మెడికల్ కళాశాలల (Medical Colleges)నిర్మాణం జరుగుతుందన్నారు. పీపీపీ విధానాన్ని జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, చెన్నై ఐఐటీ వంటి ఉన్నత విద్య సంస్థల్లోనూ అనుసరిస్తున్నారు. 33 ఏళ్ల తరువాత ఆ వైద్య కళాశాలలన్నీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయి. కళాశాలల నిర్వహణ కోసం టెండరు ద్వారా ఎంపిక చేసిన సంస్థలు పెట్టుబడి పెడతాయి. కళాశాలలు నడుపుతాయి. ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రస్తావనే ఇక్కడ ఉత్పన్నం కాదు అని మంత్రి సత్యకుమార్ వివరించారు.

ప్రతి కళాశాలలో 150 చొప్పున సీట్లు

625 ప్రభుత్వం వద్దనే యాజమాన్య హక్కులు ఉంటాయి. కళాశాలలపై ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. పీపీపీ విధానంలో నడిచే కళాశాలల్లో జాతీయ స్థాయి కోటా కింద సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉండదు. కన్వీనర్ కోటాలోని 50 సీట్లు ఉచితంగా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. పీపీపీ విధానంలో నడవబోయే కళాశాలల్లో 150 చొప్పున సీట్లుంటాయి. పీపీపీ విధానంలో ప్రారంభించే వైద్య కళాశాలల్లో పడకలుంటాయి. వీటిల్లో ఓపీ సేవలు పూర్తిగా ఉచితం. ఇన్పేషంట్ల కోసం కేటాయించిన పడకల్లో70 ఉచితంగా పేదలకు కేటాయించాలి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా కింద సేవలు ఉచితంగా పీపీపీ విధానంలో నడిచే కళాశాలల్లోనూ కొనసాగుతాయి. గత వైకాపా పాలనలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.8,480 కోట్లు ఆమోదిత వ్యయం కాగా…రూ.1,550 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. కేంద్రం, నాబార్డు నుంచి వచ్చిన నిధులను మాత్రమే ఇందుకు వినియోగించింది. వైద్య కళాశాలల నిర్మాణాల పునరుద్ధరణకు రూ.786.82 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చుపెట్టింది. పార్వతీపురంలో కళాశాల ఏర్పాటుకు గత వైకాపా ప్రభుత్వం భూమిని కూడా సేకరించలేదు.

భూమి లేకుండా నిర్మాణాలు జరపగలరా? ఇదసలు సాధ్యమవుతుందా? బెంగుళూరులో భూమిని కొనుగోలుచేయకుండానే.. భవనాలు నిర్మించారా? ప్యాలెస్ నిర్మాణం చేశారా? పులివెందుల కళాశాలలో నిర్మాణాలైతే జరిపారు. కానీ అధ్యాపకులను నియమించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎన్ఎంసీ 47.5 బోధకుల కొరత ఉందని తనిఖీల ద్వారా గుర్తించింది. ఇప్పటికే ప్రారంభమైన రాజమహేంద్రవరం వైద్య కళాశాలకు రూ.475 కోట్లు ఆమోదిత వ్యయం కాగా.. గత వైకాపా ప్రభుత్వంలో… కేవలం రూ.81.74 లక్షలు మాత్రమే ఖర్చుపెట్టారు. కూటమి ప్రభుత్వం రూ.53.73 కోట్లు ఖర్చుపెట్టింది. మచిలీపట్నం కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద రూ.195 కోట్లు గ్రాంటు వచ్చింది. దీనివల్ల ఈ కళాశాలకు .550 కోట్ల వ్యయానికిగాను రూ.206 కోట్లు గత ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఈ కళాశాల బిల్లుల చెల్లింపుల కోసం కూటమి ప్రభుత్వం రూ.86.32 లక్షలను కూటమి ప్రభుత్వం చెల్లించింది అని మంత్రి వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

AP Government Breaking News Education Issues latest news Poor Students Satyakumar Yadav student welfare Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.