📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Satyakumar Yadav: ఆహార పదార్థాలు, మందుల నాణ్యతపై నిఘా పెంచాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: ఆహారపదార్ధాలు, మందుల నాణ్యతపై నిఘా పెంచాలితక్షణమే .ఖాళీలగా ఉన్న ఖాళీగా భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ఆదేశించారు. ఈ రెండు విభాగాలకు రెగ్యులర్ హెచ్వోడీలను నియమించాలి కల్తీతో కూడిన ఆహార పదార్థాలు (Adulterated food items), నాణ్యత లోపించిన మందుల సరఫరా పరిణామాల దృష్ట్యా ఈ రెండు విషయాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆహార పదార్ధాల్లో కల్తీని అరికట్టే ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) మరియు కల్తీ మందుల సరఫరాను నియంత్రించే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డిసిఎ) విభాగాల్లో వివిధ శ్రేణుల్లో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంత్రి సూచించారు.

మందుల సరఫరాల్లో నిఘా వ్యవస్థ పటిష్టం

మంత్రిత్వ శాఖలోని పలు విభాగాల పనితీరును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుతో రెండున్నర గంటలకు పైగా గురువారంనాడు వెలగపూడిలోని ఏపి సచివాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) సమీక్షించారు. కల్తీ ఆహార పదార్ధాలు, మందుల సరఫరా (Supply of medicines) కు పాల్పడే వారిలో భయాన్ని కలిగించేలా తరచూ తనిఖీలు చేపట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎన్ఫోర్స్ మెంట్ విషయంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐపిఎం, డిసిఎ విభాగాలకు దీర్ఘకాలంగా రెగ్యులర్ విభాగాధిపతులు లేకపోవడంతో ఈ శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అన్నారు. డిజిపి స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో డిసిఎ పనిచేయాల్సి ఉన్నందున, ఉన్నతాధికారుల కొరత ఉన్న నేపథ్యంలో ఐజిపి స్థాయి అధికారిని డైరెక్టర్ జనరల్ డిసిఎగా నియమించేందుకు తగు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. మరింత ఐపిఎంకు డైరెక్టర్ పోస్టు ఇప్పటివరకు మంజూరు కానందున, ఈ విభాగానికి మంజూరై ఖాళీగా ఉన్న కొన్ని స్థానాల్ని సరెండర్ చేసి డైరెక్టర్ పోస్టును సృష్టించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడానికి వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సమగ్ర నియామక ప్రణాళికను రూపొందించి నియామకాలు చేపట్టాలని మంత్రి సూచించారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: TTD: తిరుమల లో రూ.8.13కోట్లతో టిటిడికి ఐఒసి గ్యాస్ ప్లాంట్

Adulterated Medicines Breaking News Drug Safety Monitoring Food Quality India Food Safety Awareness latest news Satyakumar Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.