రేణిగుంట: గత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు చేయలేదని మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Satya Prasad) ఘాటుగా స్పందించారు. రేణిగుంట పట్టణంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Satya Prasad) గత వైసిపి ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఘాటుగా విమర్శించారు. చిన్న బత్తాయి జ్యూస్ అమ్ముకునే బండ్లలో డిజిటల్ పేమెంట్లు పెట్టినప్పుడు లక్షల కోట్లు రూపాయల వ్యాపారం జరిగే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
మద్యం షాపుల నగదు ఎక్కడికి పోయిందో చెప్పాలి
మద్యం షాపులకు వచ్చిన నగదు ఏమైంది అంటూ ప్రశ్నించారు. నాసిరకమైన (Inferior) మందు తయారు చేసి ఎంతోమందిని చావుకు కారకులయ్యారన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఎప్పటికీ పాల్పడదని అన్నారు. 30 సంవత్సరాలు వెనక్కు వెళ్లిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలని అంశాలను అమలుపరుస్తూ వస్తున్నారు. సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పెంపుదల, విద్యార్థులకు చదువుల కోసం తల్లికి వందనం పథకాలను అమలుపరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Minister Muralidhar Mohol: ఏపి నుంచి వారానికి 1,194 విమానాల రాకపోకలు