📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Satya Kumar Yadav: ప్రభుత్వ వైద్యులు అవినీతికి పాల్పడితే కొరడా!

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడ : ప్రభుత్వ వైద్యుల పనితీరులో మార్పురావాలని ఆరోగ్య సేవల సమన్వయాధికారులకు శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) సూచించారు. రెండు నెలల క్రితం డిసిహెచ్ యస్లు, డిఎంహెచ్వోల సమీక్షా సమావేశంలో పలు కీలకాంశాల్ని గమనించానని, వాటిని సరిచేసేందుకు శిక్షణివ్వాలని భావించామని మంత్రి తెలిపారు. జిల్లాల్లో టీంను లీడ్ చేసే లీడర్లుగా జిల్లా అధికారులు ఎదగాలన్నారు. తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో 26 జిల్లాల డిసిహెచ్యస్లకు నాలుగు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ (Secondary Health Directorate) రూపొందించిన సమగ్ర యాప్ ను మంత్రి ఆవిష్కరించారు. డిసిహెచ్ ఏస్ లను నుద్దేశించి మంత్రి మాట్లాడుతూ అవినీతిని ఏమాత్రం సహించేదిలేదన్నారు.

అంకిత భావంతో పనిచేయాలని మంత్రి తెలిపారు

సమన్వయంతో పనిచేయడం ద్వారా వైద్యసేవల్లో ఆశించిన మార్పు తీసుకురావాలని, డిసిహెచ్ యస్ లుగా మీమీ బాధ్యతలకు పూర్తి న్యాయం చేయాలని, డిసిహెచ్ యస్ ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని మంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించడం వల్ల వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోగలుగుతారన్నారు. సమయపాలన పాటించని డాక్టర్ల విషయంలో ఉపేక్షించేదిలేదన్నారు. వ్యక్తిగత విషయాలకంటే లోగులకు సేవకు ప్రాధాన్యతనివ్వాలని, ఆర్థికాభివృద్ధికి ఆరోగ్యమే ప్రధానమనే విషయాన్ని గ్రహించాలని, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునే దిశగా అంకిత భావంతో పనిచేయాలని మంత్రి తెలిపారు. సెకండరీ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల (Cesarean operations) ను బాగా తగ్గించాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లో డిసిహెచ్ యస్ ఆధ్వర్యంలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో మోలిక సదుపాయాలు లేకపోవడం, హాజరు పర్యవేక్షణా యంత్రాంగం లేకపోవడం, డయాగ్నోస్టిక్ సేవల లభ్యత, సరైన ఆడిట్ లేకపోవడం, జిల్లా స్థాయిల్లో లోపాలు, కొరతల్ని గుర్తించలేకపోవడం వల్ల వీటిని సరిచేసేందుకు శిక్షణా కార్యక్రమం అవరమని భావించామన్నారు.

Satya Kumar Yadav: ప్రభుత్వ వైద్యులు అవినీతికి పాల్పడితే కొరడా!

వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని

సరైన ఓరియంటేషన్ ఇవ్వగలిగితే వ్యవస్థను సరిచేయవచ్చనేది ముఖ్యోద్దేశమన్నారు.కింది స్థాయి నుండి పైస్థాయి వరకు వైద్య సేవల్ని గాడిన పెట్టాలన్నారు. సెకండరీ ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, ప్రిఆథరైజేషన్లు పెంచాలని మంత్రి ఆదేశించారు. గతేడాది జూన్లో 15 శాతమున్న ప్రిఆథరైజేషన్లు (Preauthorizations) ఈ ఏడాది జూన్ నాటికి 24 శాతానికి పెరిగాయని, దీన్ని 80 శాతానికి పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 నుంచి 90 శాతం మేర ప్రిఆథరైజేషన్లు జరుగుతున్నాయని, సెకండరీ ఆసుపత్రుల్లో కూడా ఇదే స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిఆథరైజేషన్ల విషయంలో సెకండరీ హెల్త్ డైరెక్టర్, డిసిహెచ్ యస్ లు సీరియస్ గా వ్యవహరించాలన్నారు.

సత్య కుమార్ యాదవ్ ఎవరు?

సత్య కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2024 జూన్ 12 నుంచి ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి (Minister of Health, Family Welfare & Medical Education), అలాగే ధర్మవరం‌ నియోజకవర్గం నుండి కొత్తగా ఎమ్మెల్యేగా (MLA) ఎన్నికయ్యారు.

సత్య కుమార్ యాదవ్ విద్యాభ్యాస వివరాలు ఏమిటి?

ప్రాథమిక విద్య ప్రొద్దుటూరు (కడప జిల్లా), నాగర్‌కర్నూల్ (తెలంగాణ)లో పూర్తి చేసుకున్నారు.ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా; AMIE కోర్సు; మదురై కామరాజ్ యూనివర్సిటీలో పాలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్; చెన్నైలో ITM నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: S. M. Basha: రాయలసీమలో సామాజిక న్యాయం జరగాలి

APHealthMinister BJPLeaderAP Breaking News latest news SatyakumarYadav

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.