Satya Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ (AP) వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉదారత ఒక నిరుపేద యువకుడికి ప్రాణం పోసింది. తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న యువకుడికి మంత్రి సహాయంతో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
Read also: MohanBabu University: యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
యువకుడి గుండెను అమర్చిన బెంగళూరు వైద్యులు
శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన చరణ్ కుమార్ అనే యువకుడు తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరాడు. గుండె మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పడంతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు మంత్రి సత్యకుమార్‌ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన మంత్రి, బెంగళూరులోని దేహీ ఇన్‌స్టిట్యూట్ వైద్యులతో మాట్లాడి చరణ్‌కు మెరుగైన వైద్యం అందేలా చూశారు. బ్రెయిన్ డెడ్ అయిన 27 ఏళ్ల యువకుడి గుండెను దాతల అంగీకారంతో చరణ్‌కు అమర్చారు. ప్రస్తుతం చరణ్ కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తమ కుమారుడికి ప్రాణదానం చేసిన మంత్రికి, వైద్యులకు చరణ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: