సదరం సర్టిఫికెట్ జారీకి లంచం డిమాండ్ చేసిన వైద్యుడిపై చర్యలు
విజయవాడ : సదరం సర్టిఫికెట్ జారీకి లంచం అడిగిన ఒక వైద్యున్ని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఉద్యోగం నుంచి తొలిగించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఒక యువతికి సదరం సర్టిఫికేట్ కోసం ఆమె తండ్రి నుంచి లంచం డిమాండ్ చేసిన ఒక ప్రభుత్వ వైద్యుడి పై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా ఏసీబీ విచారణ ఆదేశించారు. అనంతరం ఆ నివేదికపై మళ్ళీ మంత్రి(sathyakumar)విచారింంచారు. ఆపై వైద్యున్ని తక్షణమే విధుల నుండి తొలగించాలని మంత్రి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 2022లో జరిగిన ఈ సంఘటన జరిగింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక బాలికకు సదరం సర్టిఫికెట్ జారీ చేయడానికి వైయస్సార్ కడప జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జిజిహెచ్)లో పిల్లల మానసిక వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న ఒక డాక్టరు ఆ బాలిక తండ్రి నుంచి రూ.10 వేలు లంచాన్ని అడిగారు. అంత ఇచ్చుకోలేనని, రూ.5 వేల వరకు ఇవ్వగలనని తండ్రి ప్రాధేయపడ్డారు.
Read also: ఓటమి పై టీమిండియా కెప్టెన్ ఏమన్నారంటే?
మానసిక సమస్యలతో బాధపడుతున్న బాలిక కోసం లంచం అడిగిన వైద్యుడి కేసు
వైద్యుడు అంగీకరించకపోవడంతో దిక్కుతోచని ఆ తండ్రి చివరిగా రూ.7వేలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆయినా రూ.10వేలు ఇవ్వాల్సిందేనని, అది కూడా రెండ్రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆ వైద్యుడు గడువు పెట్టాడు. గతిలేని పరిస్థితుల్లో ఆ తండ్రి జిల్లా కలెక్టర్ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారులు ఎసిబిను(sathyakumar)కోరగా, వారు విచారణ చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, లభించిన పత్రాల ఆధారంగా లంచం ఆరోపణ వాస్తవమేనని ఏప్రిల్ 2025లో ఎసిబి తన నివేదికలో స్పష్టం చేసింది. సదరు వైద్యుడు కాంట్రాక్ట్ సేవలందిస్తున్నందున అతనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న బాలిక దుస్థితిని గమనించకుండా తన స్వార్జన కోసం అడ్డదారులు తొక్కాలనుకున్న ఆ వైద్యుడి వైఖరిని తీవ్రంగా పరిగణించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అతనికి తక్షణమే ఉద్వాసన పలకాలని ఆదేశాలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: