📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News telugu: Saptagiri Express: తిరుపతి – చెన్నై సప్తగిరి ఎక్స్ప్రెస్ రైలుకు ప్రత్యేక బోగీలు

Author Icon By Sharanya
Updated: September 18, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దక్షిణమధ్యరైల్వేశాఖ ప్రయాణీ కులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు చూస్తోంది. తిరుపతి అంతర్జాతీయ స్థాయి రైల్వేస్టేషన్ గా అభివృద్ధి విస్తరణ జరుగుతున్న సమయంలో ప్రయాణీలకు సేవలు కూడా ధీటుగా అందించాలనే సదుద్దేశ్యంతో తొలిసారిగా తిరుపతి- చెన్నై (Tirupati-Chennai)సెంట్రల్ మధ్య దడిచే సప్తగిరిఎక్స్ ప్రెస్ రైలుకు ఎల్వాచ్బీ బోగీలను అమర్చుతున్నారు .ఈ కోచ్లు అందుబాటులోకి రావడం తొలిసారిగా కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలీహెచ్బీ కోచ్లు అమర్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్లు ఈనెల 20వతేదీ నుండిప్రయాణీకులకు అందుబాటు లోకి రానుంది.

News telugu

తిరుపతి యాత్రాస్థలం ప్రాధాన్యత దృష్ట్యా ప్రతిరోజూ తిరుపతి నుండి పుత్తూరు, నగరి, తిరుత్తణి, అరక్కోణం మీదుగా చెన్నైకి ప్రయాణీకులు అనూహ్యంగానే ప్రయాణిస్తున్నారు. రోజుకు సరాసరి తిరుపతి నుండి చెన్నైకి వందల సంఖ్యలో పలు రకాల వ్యాపారాలు, ఇతరత్రా ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రయాణీస్తున్నారు. ఇక చెన్నై నుండి తిరుపతికి వచ్చే ఈ రైల్లో యాత్రికులు కూడా రద్దీగానే ఉంటారు. రోజుకు రెండుసార్లు తిరిగే ఈ రైలును ఇప్పుడు అధునాతనంగా అన్ని హంగులతో బోగీలు మార్పు చేస్తున్నారు. 16053/16054, 16057/16058 నంబర్లతో ఆధునిక ఎల్బీహెచ్ కోచ్ల(LBH Coaches) తో నడుస్తాయి. ఈ కోచ్లకు మారిన తరువాత రైళ్ళ కూర్పులో మార్పులు ఉంటాయి. ఇందులో ఒక ఏసి చైర్కోచ్, 10 చైర్కార్కిచ్లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. అదనంగా దివ్యాంగులకు అను కూలంగా ఒక సెకండ్ క్లాస్ కోచ్, ఒక లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ కూడా రైల్లో ఉంటుంది. జర్మనీకి చెందిన సంస్థ డిజైన్చేసిన బోగీలు. ఐసిఎఫ్ రూపొందించిన బోగీలకంటే ఈ ఎలీహెచ్బీ బోగీలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగానికి అను గుణంగా ఈకోచ్లు రూపొందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/kondapalli-srinivas-government-aims-one-entrepreneur-per-household/andhra-pradesh/549687/

Breaking News Chennai train service latest news railway news India Saptagiri Express special coaches added Telugu News Tirupati Chennai train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.