సంక్రాంతి(Sankranthi) పండుగ వేళ సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా వాహనదారులు చెల్లించాల్సిన టోల్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం.
Read Also: TTD: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి…
ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యం
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అలాగే తెలంగాణలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పండుగ(Sankranthi) సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఏర్పడే భారీ ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు, ఐదు నుంచి ఏడు రోజుల పాటు టోల్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
ఈ ప్రతిపాదనకు కేంద్రం నుంచి అనుమతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో పండుగ ప్రయాణ ఖర్చులు కొంత మేర తగ్గనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణాలు సాఫీగా సాగడంతో పాటు, టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలు తగ్గే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: