Sankranthi cockfight : సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపందేలు జోరుగా సాగాయి. పండుగ రెండో రోజున నిర్వహించిన ఈ కోడిపందేల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. ముఖ్యంగా పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన పోటీలు స్థానికుల దృష్టిని ఆకర్షించాయి.
ఈ బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేష్ కోళ్ళ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ ఉత్కంఠభరిత పందెల్లో రాజమండ్రి రమేష్ విజయం సాధించి రూ.1.53 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేశాడు. ఈ గెలుపు ఈ ఏడాది జిల్లాలోనే అతిపెద్ద కోడిపందెంగా స్థానికులు చెబుతున్నారు.
Read Also: Anaganaga Oka Raju Movie: ‘అనగనగా ఒక రాజు’- సినిమా ఎలా ఉందంటే?
స్థానికుల సమాచారం ప్రకారం, పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి (Sankranthi cockfight) ఇదే టాప్ కోడిపందెం. గెలుపు అవకాశాలు పెంచుకునేందుకు పందెం వేయే వారు కోళ్ల జాతి, సరైన సమయం, ముహూర్తం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సంక్రాంతి వేళ కోడిపందేలు కొంతమందికి వినోదంగా, మరికొందరికి ఉత్కంఠగా మారాయని వారు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: