📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: Tirumala-బ్రహ్మోత్సవాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యత

Author Icon By Pooja
Updated: September 12, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala- బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు విస్తృతంగా కల్పించాలని, ఎప్పటికప్పుడు అవసరమైన సేవలు అందించాలని అనిల్కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal)అధికారులకు నిర్దేశం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాఢవీధుల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందుకు అవసరమైన సిబ్బందిని అదనంగా డిప్యూటేషన్‌పై నియమించుకోవాలని సూచించారు. సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, అధికారుల సేవలపై గురువారం రాత్రి తిరుమల అన్నమయ్య భవనంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.

అధికారుల సమీక్ష సమావేశం

టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎసి మురళీకృష్ణ, సిఇ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, డిఎపి ఫణికుమార్నాయుడు, సిపిఆర్‌ఒ డాక్టర్ తలారి రవితో కలసి ఇఒ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు తిరుమలలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలోనూ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

గ్యాలరీల్లోని భక్తులకు(Devotees in the galleries) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలన్నారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వస్తున్నారని, ఏర్పాట్లు మరింత పటిష్టంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

బ్రహ్మోత్సవాల్లో అనిల్కుమార్ సింఘాల్ ఏ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టారు?
మాఢవీధుల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగనున్నాయి?
సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Indo-America-మా స్నేహం చిరకాలమైనది..మార్కో రూబియో

Anil Kumar Singhal Devotee Facilities Latest News in Telugu Sanitation Telugu News Today Tirumala Brahmotsavam TTD Arrangements

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.