📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Sangam Barrage: సంగం ఆనకట్ట షట్టర్ల పైన ఆగిపోయిన ఇసుక బోటు

Author Icon By Saritha
Updated: October 31, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
సంగం బ్యారేజికి తప్పిన ముప్పు

సంగం (నెల్లూరు) : జిల్లాకలెక్టర్ చొరవతో సంగం బ్యారేజికి(Sangam Barrage) పెద్ద ముప్పు తప్పింది. సంగం బ్యారేజి వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువు వున్న ఇసుక బోటు సంగం ఆనకట్ట వద్దకు వచ్చి షట్టర్లపైన ఆగిపోయింది. అదే ఆబోటు బ్యారేజిని నీటి వేగంలో వెళ్లి ఢీకొని వుంటే బ్యారేజికి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. స్థానికులు సంగం ఆనకట్ట షట్టర్లపై ఆగిపోయిన విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో మండల స్థాయి అధికారులు వెంటనే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకి, జిల్లా ఎసిపి అజితా వెజండ్లకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి సంగం బ్యారేజి వద్దకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ యుద్ధప్రాతిపదికన చర్యలుతీసుకొని ఎన్ఆర్ఎప్, ఎస్ఆర్ఎప్ బృందాలను కృష్ణపట్నం పోర్టు గస్తీబృందాన్ని రంగంలోకి దింపారు. 30 టన్నుల బోటును ఒడ్డుకు చేర్చడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్(District Collector) కృషికి ప్రతి ఒక్కరు హ్యాట్సాప్ అన్నారు.సంగం బ్యారేజి వద్ద లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువున్న ఇసుక బోటు గేట్లు వరకు రాకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పి అజితా వెజండ్లని ఆయన అభినందించారు. అలాగే ఎన్డీఆర్ఎప్ బృందం, ఎస్ఆర్ఎఫ్ బృందాన్ని, పోలీసులను, ఇరిగేషన్, మండల స్థాయి అధికారులందరికి ప్రశంసలు దక్కాయి. ఎన్ఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ బృందాల సేవలను అభినందిస్తు ఆత్మకూరు ఆర్ ఒ పావని, తహసిల్దారు సోమ్లానాయక్, వారికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. వారి సేవలను అభినందించారు.

Read also: CPM నేత దారుణ హత్య

Sangam Barrage: సంగం ఆనకట్ట షట్టర్ల పైన ఆగిపోయిన ఇసుక బోటు

జిల్లా కలెక్టర్‌, ఎన్డీఆర్ఎఫ్‌ బృందాల సమన్వయంతో సురక్షిత రక్షణ

ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి పరిస్థితిని(Sangam Barrage) సమీక్షించారు. హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేసి, ప్రతి బృందానికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. మొత్తం 30 మంది చొప్పున ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ బృందాలు, 100 మంది పోలీసు సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంగా కృషి చేయడంతో పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగామని కలెక్టర్ వివరించారు. ప్రవాహ ధాటికి తీసుకురాలేకపోయిన మూడవ పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న సమయంలో 30 టన్నుల పడవ ప్రాజెక్టుకు తగిలితే సంగం బ్యారేజ్ ఉనికే ప్రశ్నార్ధకమయ్యేదని కలెక్టర్ అన్నారు. అంతేకాకుండా 85 గేట్లతో 3,85,000 ఎకరాలు ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తున్న సంగం బ్యారేజ్కు ప్రమాదం జరిగి ఉంటే నీరు వృధాగా పోయి రాబోయే సీజన్ లో రైతులు నష్టపోయేవారన్నారు. అలాగే పొదలకూరు, సంగం గ్రామాలకు మధ్య రాకపోకలు స్థంభించేవని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Collector Himanshu Shukla Krishna Patnam Port Latest News in Telugu Nellore District Sand Boat Incident sangam barrage Sangam Boat Rescue Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.