📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Sajjala Sreedhar Reddy: లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్

Author Icon By Sharanya
Updated: April 26, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హల్ చల్‌కు కారణమైన లిక్కర్ స్కాం కేసులో ఇటీవల మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో అదుపులోకి.. విజయవాడకు తరలింపు

శ్రీధర్‌రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో సిట్ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వెంటనే విజయవాడకు తరలించి, నేడు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి మే 6వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. సిట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త మద్యం విధానం పేరుతో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు సుమారుగా రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు అక్రమ వసూళ్లు జరిగాయని తెలిసింది. ఈ వ్యవహారంలో శ్రీధర్ రెడ్డి కూడా కీలక సమావేశాల్లో పాల్గొన్నట్లు సిట్ నివేదికలు స్పష్టం చేశాయి.

కీలక సమావేశాల్లో పాల్గొన్న నేతలు

ఈ కుట్రలో భాగంగా జరిగిన కీలక సమావేశాల్లో శ్రీధర్‌రెడ్డి కూడా పాల్గొన్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్‌ కెసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌ వంటి వారు కూడా పాల్గొన్నట్లు కేసు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిట్ అధికారులు శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. 

Read also: YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో రంగన్న భార్యకు సిట్ నోటీసులు

#CorruptionCase #LiquorScam #PoliticalNews #Remand #SajjalaSreedharReddy #YSRCP Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.