📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sajjala Ramakrishna: లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sajjala Ramakrishna: వైసీపీ అధినేత జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తిరుమల లడ్డూ ప్రసాదంపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్స్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని సజ్జల కొట్టిపారేశారు. వైసీపీ హయాంలోనే తిరుమలలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మార్కెట్‌లో హెరిటేజ్ నెయ్యి ధర కంటే ఇందాపూర్, అమూల్ నెయ్యి ధరలు తక్కువగా ఉన్నాయని… కేవలం కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే నెయ్యి కాంట్రాక్టుల విషయంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Andhra Pradesh: జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

Sajjala Ramakrishna: Chandrababu’s conspiracy allegations on laddu prasad.. Sajjala

చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న

నెయ్యి కాంట్రాక్టుల వెనుక భారీ ఆర్థిక కుంభకోణం దాగి ఉందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సజ్జల డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసి స్వామివారి సొమ్మును దోచుకోవడమే ఈ విష ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని విమర్శించారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి సంబంధించిన వీడియోల వివాదంపై సజ్జల స్పందిస్తూ… గతంలో తమ హయాంలో సినీ నటుడు పృథ్వీపై ఆరోపణలు రాగానే తక్షణమే రాజీనామా చేయించామని, కానీ ఇప్పుడు బీఆర్ నాయుడి విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలపై చంద్రబాబుకు విశ్వాసం లేదనే విషయం మరోసారి అర్థమయిందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BR Naidu Chandrababu Naidu Jagan Mohan Reddy Sajjala Ramakrishna Reddy tirumala laddu TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.