📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

S. Venkateswar: మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

Author Icon By Saritha
Updated: March 2, 2026 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శుక్రవారం గుమ్మిడిపూడి తహశీల్దార్ కార్యాలయం అధికారులతో సమావేశం నిర్వాహణ

S. Venkateswar: ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో మత్స్యకారులకు ఎదురవుతున్న అంతర్‌రాష్ట్ర సమస్యల శాశ్వత పరిష్కారం త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి పులికాట్ సరస్సు పరిధిలో జీవనోపాధి కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ (AP) మత్స్యకారులు ఇటీవలి కాలంలో ఎదుర్కొంటున్న వివాదాలు, సరిహద్దు సమస్యలు, భద్రతా అంశాలు వంటి విషయాలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్, తిరుపతి ఎస్. పి సుబ్బరాయుడు, డి. ఆర్. ఓ. జి. నరసింహులు, సంబంధిత ఉన్నతాధికారులతో కలసి తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్, ఎస్. పి వివేకానంద శుక్లా లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు.

Read Also: Telangana Govt: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత

S. Venkateswar We will take steps to resolve the problems of fishermen

జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ S. Venkateswar మాట్లాడుతూ… మత్స్యకారుల జీవనోపాధి రక్షణ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇరు రాష్ట్రాల జిల్లాలలో సరిహద్దు ప్రాంతాలపై స్పష్టత లేకపోవడం వల్ల మత్స్యకారుల మధ్య అపోహలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను సమీక్షించి, భవిష్యత్తులో అలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరు రాష్ట్రాల పరిపాలన యంత్రాంగం పరస్పర అవగాహనతో పనిచేస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్త సర్వే నిర్వహించి స్పష్టమైన గుర్తులు ఏర్పాటు చేయడం, అవసరమైతే సరిహద్దు రాళ్లు ప్రతిష్ఠించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాలకు సంబందిత అధికారులందరూ సమన్వయo చేసుకుని అవసరమైతే సంయుక్త పహారా, హాట్‌లైన్ సమన్వయం, తక్షణ సమాచార వ్యవస్థ ఏర్పాటుపై చేయడం వంటి విషాయాలపై చర్చించారు.

గుమ్మిడిపూడిలో ముఖాముఖి చర్చలు

త్వరలో అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేపడతామని తెలిపారు. తమిళనాడు వైపు మత్స్యకారులు మరియు సబ్‌డివిజనల్ అధికారుల నుంచి కొద్దిమంది ప్రతినిధుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గుమ్మిడిపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద సరిహద్దు సమస్యల పై శుక్రవారం సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఇరు రాష్ట్రాల నుంచి మత్స్యకార సంఘాల ప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్, ఫిషరీస్ అధికారులు పాల్గొనాలని తెలిపారు. సమస్య ఉన్న గ్రామాలైన చిన్న మంగడ, పెద్ద మంగడ, పుడుకుప్పం, కీర పాక్కం ఈ గ్రామాల నుంచి ఇద్దరు ముగ్గురు ముఖ్య ప్రతినిధులను తీసుకురావాలని సూచించారు. ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో ఒక స్థానిక ఒప్పందం / ప్రకటన రూపొందించుకోవాలని, అది తాత్కాలికంగా రెండు వైపులా అమలులో ఉండాలని చెప్పారు. మత్స్యకారులు శాంతి భద్రతలను పాటిస్తూ చట్టబద్ధంగా వేట కార్యకలాపాలు కొనసాగించాలని, సమస్యలు తలెత్తిన వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.

సాంకేతికతతో పరిష్కారం

తమిళనాడు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ… ఇరు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య సౌహార్ద వాతావరణం నెలకొల్పేందుకు పరస్పర చర్చలు, అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని , సంబంధిత శాఖల అధికారులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఏవైనా సమస్యలు లేదా అవరోధాలు ఏర్పడితే, సంబంధిత శాఖలతో సంప్రదించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక పరిష్కారం అమలులో ఉందని, దీర్ఘకాలిక పరిష్కారం కోసం సాంకేతికతతో పాటు సమిష్టి నిర్ణయాలు అవసరమని అన్నారు. సరిహద్దు అంశంపై ఫీల్డ్ స్టాఫ్‌ను నియమించి సరిహద్దుల పరిశీలన చేపడతామని తెలిపారు.

గత 30 సంవత్సరాలుగా అమలులో ఉన్న విధానమే ప్రస్తుతం తాత్కాలిక పరిష్కారంగా కొనసాగుతోందని, రాష్ట్ర సరిహద్దుల ఖచ్చితమైన నిర్ణయమే దీర్ఘకాలిక పరిష్కారమవుతుందని తెలిపారు. ఎన్నికల అనంతరం శాశ్వత సరిహద్దు నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. గతంలో అన్ని గ్రామాలు ఒకే సంఘంగా ఉన్న విధానాన్ని మళ్లీ అమలు చేయడం మధ్యకాలిక పరిష్కారంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇరు పక్షాలు అంగీకారానికి వస్తే, GPS ద్వారా సరిహద్దులను డిజిటల్‌గా నమోదు చేసి భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు సూళ్లూరుపేట ఆర్. డి. ఓ దేవేందర్ రెడ్డి, సూళ్లూరుపేట, గుమ్మడిపూడి డి. ఎస్. పి. లు, సూళ్లూరుపేట డి. ఎఫ్. ఓ, తీరుపతి జిల్లా మత్స్య శాఖ అధికారి, తమిళనాడు తిరవల్లూరు మత్స్య శాఖ అధికారి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP TN Border Fishermen Issues PulicatLake Tirupati Collector Tiruvallur Collector

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.