📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: S.R. Sankaran: ఎస్.ఆర్.శంకరన్ విధానాలు అనుసరణీయం

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉన్నతాధికారి హోదాలో ఎస్.ఆర్.శంకరన్ అమలు చేసిన పలు విప్లవాత్మక విధానాలు సామాజిక అసమానతల తొలగింపునకు దోహదం(S.R. Sankaran) చేశాయని పలువురు వక్తలు కొనియాడారు. అటువంటి మహోన్నతమైన అధికారిని స్మరించుకోవడం ద్వారా నేటితరం స్ఫూర్తిపొందాలన్నారు. నిరంతరం ప్రజా సేవలోనే ఉంటూ పేదల కోసం పరితపించిన శంకరన్ అందరికీ ఆదర్శప్రాయులని పలువురు వక్తలు అన్నారు. పేదల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు, పథకాలను రూపొందించిన మాజీ ఐఎఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ 91వ జయంతి విజయవాడ బిఆర్ అంబేద్కర్,(BR Ambedkar) బాబు జగజ్జీవన్ ఐక్యతా భవన్లో ఘనంగా జరిగింది. ఎస్.ఆర్.శంకరన్ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు, ప్రజాప్రతి నిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని శంకరన్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Read also: కావేరి బస్సుపై 16 చలాన్లు, రూ.23 వేల ఫైన్

S.R. Sankaran: ఎస్.ఆర్.శంకరన్ విధానాలు అనుసరణీయం

సామాజిక సమానత్వం కోసం రూపొందించిన విధానాల ప్రాముఖ్యత

ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన(S.R. Sankaran) జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కాకి సునీత, ఎస్సి కమిషన్ కార్యదర్శి చినరాముడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎపి ఎన్జఒ రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొలనుకొండ శివాజీ, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కె.సుబ్బారావు, బుట్టి రాయప్ప, సిపిఐ ఎన్ఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, విజయవాడ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక రిటైర్డు ఐఎఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ జయంతి సభ నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యాన జరిగింది. ఈ కార్యక్రమంలో కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎం. విజయానంద్, నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి. నరేంద్ర కుమార్, బెంగుళూరు ఎస్ఎస్ఎల ఐయు విజిటింగ్ ప్రొఫెసర్ జి. హరగోపాల్, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ పి.ఎం. సౌజన్య, రిటైర్డ్ ఐఎఎస్ డాక్టర్ చక్రపాణి, లయోలా కళాశాల వైస్ ప్రిన్సి పల్ ఫాదర్ జి. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AndhraPradesh Latest News in Telugu SocialJustice SRShankaran SRShankaranJayanti Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.