📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

S. M. Basha: రాయలసీమలో సామాజిక న్యాయం జరగాలి

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయలసీమ ప్రజావేదక చర్చా వేదికలో వక్తలు!

అనంతపురం : రాయలసీమ ప్రాంతంలో సామాజిక న్యాయం చేయాలని మానహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్. ఎం.బాషా పేర్కన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో (Press Club) రాయలసీమ సమస్యలపై ప్రజా ఉద్యమ కారుడు పసలూరి ఓబిలేసు అధ్యక్షతన చర్చావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్.ఎం. బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 14న పసలూరి ఓబిలేసు ఆధ్వర్యంలో రాయలసీమ ప్రజా వేదిక ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా ప్రజా సంఘాలు, మేధావుల సూచనలు, సలహాలు కోసం సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత మిగతా రాయలసీమ జిల్లాలో కూడా ఇలాంటి సభలు ఏర్పాటు చేసి అందరి సూచన, సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ రాయలసీమలో సామాజిక న్యాయం జరగాల్సిన ఆవశ్యకత చాలా వుందాన్నారు.

ప్రభుత్వరంగంలో మంజూరు

తన సామజిక ఉద్యమ చరిత్రలో మొదటి సారి సామాజిక రాయలసీమ అంశం చర్చకు వచ్చిందన్నారు. ఇది ఎంతో శుభదాయం, ఆయా వర్గాలు ప్రజాక్షేత్రం రావాల్సిన అవసరం వుంది, ఈ నేరు సందర్భానుసారంగా ఆనందపడుతున్నానన్నారు. గతం ప్రభుత్వం జిల్లాకొక మెడికల్ ప్రభుత్వరంగంలో మంజూరు చేసిందని, ఆ కాలేజిలు నిర్మాణ దశలో వున్నాయని వాటిని ప్రైవేట్ రంగాలకు అప్పగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఏదైనా విధానాల విషయంలో ఒకే రకంగా ఉండాలన్నారు. చివరికి మెడికల్ సీట్లు (Medical seats) అడ్మిషన్లు కూడా అవసరం లేద కేంద్ర ప్రభుత్వాని ఉత్తరం రాయడం సరికాదన్నారు. ఇలాంటి సంఘటనలు తను ఎన్నడూ చూడలేన్నారు. దేశంలో అన్ని ఐఐటి లోనూ రిజర్వేషన్లు వున్నాయని, తిరుపతి ఐఐటిలో రిజర్వేషన్ లేక పోవడం వెనక వున్న కుట్ర ఏమని ప్రశ్నించారు. అదే విధంగా అమరావతి రాజధానిలో జరిగే ఉద్యోగ నియామకాలలో రాయలసీమ అభ్యర్థులకు అన్యాయం జరిగే ప్రమాదం వుంద్నారు.

S. M. Basha: రాయలసీమలో సామాజిక న్యాయం జరగాలి

వక్తలు మాట్లాడుతూ

అమరావతి రాజదాని పరిధిలో జరిగే ఉద్యోగ నియామకాలకు ఫ్రీ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. మిగతా వక్తలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు వ్యవసాయం, సాగునీరు లాంటి అంశాలపై రాయలసీమ ఉద్యమాలు జరిగాయని, సామాజిక అంశాలు కూడా చర్చ చేయాలని, వాటి కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. ఎయిమ్స్ ను రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజి (Medical College) లను ప్రభుతమే కొనసాగించాలన్నారు. రాచేపల్లి లెదర్ పరిశ్రమను తక్షణం ప్రారంభించాలన్నారు. ఎస్ సి, ఎస్ టి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.ఇక్కడి పరిశ్రమలలో స్థానికులకు 60 శాతం ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సహజన ఖనిజ వనరుల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. వలసన నివారణ కోసం ఉపాధి హామీ పథకం ఏడాది పొడవునా కొనసాగించి, కనీస వేతనం ద్వారా రోజుకు రూ.500 కూలీ నిర్ణయుంచాలని డిమాండ్ చేశారు.

కూలీ నిర్ణయుంచాలని

స్థానిక చెరువులు, నీటి కుంటలలో ఉపాధి హామీ పథకం ద్వార పూడిక తీసి, భూగర్భ జలాలను కాపాడలన్నారు. వీటితో పాటు తుంగభధ్ర కృష్ణా జలాల (Tungabhadra Krishna waters) లో మన వాటా కోసం పోరాడాలన్నారు. హెచ్ ఎల్ సి నీటి వినియోగం కోసం సమాంతర కాలువ అనివార్యమన్నారు. హంద్రీ నీవా కాలువకు సిమెంట్ నిర్మాణాలు చేస్తే ఈ ప్రాంతంలో భూగర్భ జిలాలు అడుగంటిపోతాయని, కాలువల కోసం భూములు త్యాగం చేసిన రైతుల అన్యాయం చేయవద్దని సూచించారు. కరువు నివారణలో భాగంగా 20 శాతం భూములను పచ్చ బయళ్లుగా ఏర్పాటు చేసి పశులు, గొర్రెలకు నీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. వీటి నుంచి పాడి పరిశ్రమ, గొర్రెలు, మేక పంపకం ద్వార ఉపాధి మెరుగుపడి వలసలు తగ్గితాన్నారు.


సామాజిక న్యాయం అంటే ఏమిటి?

సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు గుర్తించబడి, రక్షించబడే సమాజంలో సంపద , అవకాశాలు, అధికారాల పంపిణీకి సంబంధించి న్యాయం . పాశ్చాత్య, ఆసియా సంస్కృతులలో , సామాజిక న్యాయం అనే భావన తరచుగా వ్యక్తులు తమ సామాజిక పాత్రలను నిర్వర్తించేలా, సమాజం నుండి వారి యోగ్యతను పొందేలా చూసే ప్రక్రియను సూచిస్తుంది.

సామాజిక న్యాయం యొక్క డిమాండ్లు ఏమిటి?

సామాజిక న్యాయం అనే భావనను బాగా అర్థం చేసుకోవడానికి ఐదు ప్రధాన సూత్రాలు చాలా ముఖ్యమైనవి. అవి వనరుల లభ్యత, సమానత్వం, భాగస్వామ్యం, వైవిధ్యం, మానవ హక్కులు .

Read hindi news: hindi.vaartha.com

Read Also: K Vijayanand: వ్యవసాయ ఫీడర్లకు 9 గంటల విద్యుత్ సరఫరా

HumanRightsForum RayalaseemaJustice SocialJusticeInRayalaseema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.