📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Russian oil :’తైల’ సంస్కారం !

Author Icon By Sudha
Updated: November 27, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కారణాలేవైనా భారత్ మాత్రం అమెరికా ‘తైల’ సంస్కారానికి సై అనక తప్పలేదు. అంతర్జాతీ య వాణిజ్యంలో ఎవరు తక్కువ ధర ఆఫర్ చేస్తే వారితోటే వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. వారి మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం సజావుగా సాగేలా చూసుకుంటారు. ఏ మాత్రం బెడిసి కొట్టినా సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. రష్యా నుంచి భారత్ చమురు (Oil) కొంటోందంటే అది మనకు లాభసాటి కనుకనే. అలాంటి చమురు దిగుమతుల విషయంలో అమెరికా హెచ్చరికలను తొలుత భారత్ పట్టించుకోలేదు. ససేమిరా ! అంది. అయినా పట్టు వదలని విక్రమార్కుని వలె అమెరికా అధ్యక్షుడు పదేపదే ‘రష్యా చమురు భారత్కు రాకుండా చేయడంలో ఒక విధంగా చెప్పాలంటే భారత్ను మెస్మరైజ్ చేశారు. ఎంతకూ వినకపోయేసరికి ట్రంప్ దృష్టి రష్యా చమురు సంస్థలపై ఆంక్షల వైపు మళ్లించింది. ‘రష్యా చమురు’ నిలిపివేత ప్రతిపాదన అమెరికాదే కానీ ముందెన్నడూ నోరు విప్పని భారత్ ‘రష్యా చమురు దిగుమతులను తగ్గించేసింది. అమెరికా చమురు సంస్థలతో జత కట్టింది. పైకి చెప్పుకోకపోయినా చమురు (Oil)దిగుమతుల్లో మార్పులు జరిగిపోయాయి. రష్యా ప్రధాన చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు పలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రె యిన్ మీద యుద్ధాన్ని ఆపకపోవడం, తన మధ్యవర్తిత్వా న్ని అవమానించడంతో ట్రంప్కు
పుతిన్ మీద ఉన్న కోపం అంతా ఇంతా కాదు. అందుకేనేమో చమురు రవాణా చేసే సూపర్ ట్యాంకర్ల చార్జీలు అమాంతం పెంచుతున్నాట్లు వాటి యాజమాన్యం ప్రకటించినట్లు అవే ఇప్పుడు అమలులో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థ కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ధరలు అయిదు రెట్లు అధికంగా ఉన్నాయి. అయినా మింగలేక కక్కలేని పరిస్థితి భారత్. ఈ ఆంక్షలు నవంబరు 21 నుంచే అమల్లోకి తెచ్చారు. రష్యాలోని రాస్వెస్ట్, లుకా యిల్లనే చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు బాగా పనిచేశాయి. చమురు రవాణా చార్జీల పెంపు చమురు దిగుమతుల మీదపడింది. ఆయా సంస్థల నుంచి చము రు కొనుగోళ్లు జరుపుతున్న భారత్, చైనా రిఫైనరీలు కాస్తంత అప్రమత్తమయ్యాయి. ఆ ఖర్చులు భరించలేక రష్యా చమురు దిగుమతులను భారత్ తగ్గించుకొంది. పరోక్షంగా రష్యా చమురుకు భారత్ మంగళం పాడినట్లే! ఇదే సమయంలో భారత్ తదితర మధ్య (పాచ్య దేశాలు అమెరికా ఉత్పత్తిదారుల నుంచి చమురు కొనుగోళ్లకు భారత్, చైనాలు ఉత్సుకత చూపుతున్నాయి. మధ్య ప్రాచ్యం నుంచి చైనాకు 2 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా ధర 576 శాతం పెరిగింది. భారత్కు కూడా రవాణా ధర పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల తర్వాత ఈ ధర ఐదు రెట్లు పెరిగినట్లు అంచనా. ఈ యేడాది రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతు లు రోజుకి సగటున 1.7 మిలియన్ బ్యారెళ్లగా ఉంది. కాగా డిసెంబరు, జనవరి నెలల్లో ఈ దిగుమతులు ఎంతో కొంత తగ్గే అవకాశముంది. సమీప కాలంలో రోజుకు 4 లక్షల బ్యారెళ్లకు తగ్గిపోయే అవకాశముంది. రష్యా చము రు కొనుగోళ్లలో ఒక ట్రంప్కు తప్ప ఏ దేశానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ముందుగా రష్యా ఇంధన సరఫరా వ్యవస్థపై ఉక్రెయిన్ల డ్రోన్ల దాడి ప్రధానంగా చర్చించుకో వాలి. దాంతో డ్రోన్ల దాడితో రష్యాలో చమురు కొరత ఏర్పడింది. దాదాపు 5వ వంతుకు చమురు శుద్ధిసామర్థ్యం పడిపోయింది. ఈ యేడాది చివర వరకు ఆంక్షలు కొన సాగుతాయని భావించిన రష్యా తాము సరిపడ చమురు నిల్వలు సమకూర్చుకునేంతవరకు ఇంధన ఎగుమతులను నిలిపివేసింది. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కల గడంతో కొన్ని చమురు శుద్ధి కర్మాగారాలను మూసివేసేందుకు నిర్ణయించింది. రష్యా నుంచి ముడి చమురు దిగు మతి చేసుకుంటున్నారన్న ఒకే ఒక కారణం చేతభారత్పై అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. అం తకు ముందు కూడా 25 శాతం వడ్డన. కాగా ఇదే సంద ర్భంలో వెనెజువెలా, ఇరాన్ల నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతినివ్వాలని భారత్ అమెరికాను కోరింది. భారత్ పెద్ద ఎత్తున రష్యా చమురు దిగుమతి చేసినందునే వాటిని శుద్ధి చేసి ఇతరత్రా అమ్ముకోవడంలో భారత్కు ఆర్థిక లబ్ది చేకూరుతోంది. అమెరికాకు మనపై ఇదే అకసు. ఇతర దేశాలు కూడా చమురు తక్కువ ధరకే అందిస్తున్నందున ప్రస్తుత పరిస్థితులలో భారత్కు ఎవరి దగ్గర కొన్నామంచిదే. కానీ అంతర్జాతీయ సమాజం, అగ్ర రాజ్యాధిపతి ఆదేశాల నుంచి భారత్ నవ్వులపాలుచేసుకో కుండా వ్యవహరించాల్సి ఉంది. ముడిచమురు అవసరా ల్లో 7.9శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా చమురును పూర్తిగా ఆపేస్తే భారత్ ఇంధన బిల్లు 9 బిలియన్ డాలర్ల మేర భారమవుతుందని కొన్ని అధ్య యనాలు చెబుతున్నాయి. 2026-27లో 11.7 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇంత సంక్లిష్ట పరిస్థితులనెదుర్కొం టూ కూడా తాజాగా భారత్కు రష్యా ప్రభుత్వం భారీ తగ్గింపు ఇచ్చింది. పోటాపోటీగా ఎగుమతుల వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తున్నాయి. రష్యా అయినా, అమెరికా అనుకూల చమురు దేశాలైనా, వెనెజువలా వంటి ఇతర చమురు బావులున్న దేశాలైనా భారత్కు సరసమైన ధరకు చమురు సరఫరా చేయగల్గుతున్నాయి. అదే యుద్ధం సద్దుమణిగితే కూడా ఇదే ధరలకు దిగుమతి ఎగుమతులు జరుగుతాయా అన్నది దైవాధీనమే!

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ayurveda BreakingNews latest news oil-processing russian-oil samskara taila TeluguNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.