📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Rural employment : పేరుమారిన ‘గ్రామీణ ఉపాధి’

Author Icon By Sudha
Updated: December 19, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకం పేరు మా రింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫుడ్ రోజ్ గార్ అండ్ అజీవకా మిషన్ గ్రామీణ్ (విబిజి రామ్ జి)గా గురువారం లోక్సభలో విపక్షాల నిరస నల హోరు మధ్య బిల్లుకు ఆమోదం లభించింది. పేరొ క్కటే మార్చుకుంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మార్చడం మామూలేగా అని సరిపెట్టుకునే వీలుం ది. కానీ ఆపథకంలోని విధివిధానాలు మారిపోనుండ టమే ప్రస్తావించుకోవాల్సి ఉంది. ఎంతో మంది గ్రామీణ పేదలు ఉపాధి (Rural employment)కూలీలుగా తమ జీవన విధానాన్ని విజయవంతంగా మార్పు చేసుకోగలిగారు. అంటే కొంతలో కొంత వద్దికగా ఐదువేళ్లూ వారి కుటుంబానికి నోట్లోకి చేరాయి. చాలా మంది పొలం పనులకు వెళ్లేవారు కూడా ఉపాధి కూలీకి వెళ్లి పొట్టపోసుకున్నారు. ఉపాధి కల్పన పథకం కొన్ని చిన్న చిన్న అంశాల్లో కాస్త వెసులుబాటు ఉన్నా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందా యనే అంచనా ఉంది. గత 20ఏళ్లలోనూ గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో గణనీయమైనమార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు, అంచనాల మేరకు నిధుల కేటాయింపు వేగంగా జరిగి గ్రామాల అభివృద్ధి బాగా జరి గిందన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమైంది. కొత్తగామహాత్మా గాంధీ పేరు స్థానే ‘వీబి- జీరామ్’ పేరిట మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలు రూపొందించింది. అవన్నీ
గతంకన్నా భిన్నంగా ఉండడంతోనే అసలు చిక్కొ చ్చిపడింది. ఉపాధి దినాలను 100నుంచి 125కి పెంచ డం బాగానే ఉంది. కానీ మిగిలిన షరతులన్నీ ఏమాత్రం మెరుగైన ఉపాధి కల్పించే స్థాయిలో లేవు. గతంలో మొత్త మంతా కేంద్రమే భరించేది. ఇప్పుడైతే రాష్ట్రాల వారీకొంత మేరకు కేంద్రం నిధులుసమకూరుస్తుంది. ఆ నిధులు న్నంతవరకే ఎలాంటి ఉపాధి పనులైనా జరిపించుకోవ చ్చు. రాష్ట్రాలకు నిధులు కేటాయింపు మేరకే పనులు జరి పించుకోవాలి. తప్పితే అంతకన్నా నిధులు ఎక్కువ అవస రమైతే ఆ సొమ్మును రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు పెట్టు కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పంచాయతీ అవసరాలకేఖర్చుచేయాలి. ఏమాత్రం తేడా ఉన్నా నిధులు ఆగిపోతాయి. వ్యవసాయ సీజన్లో ‘ఉపాధి హామీ’కి హాలిడే ప్రకటించా లన్న నిబంధన కొత్తగా చేర్చాయి. గతంలో ఇలాంటి హామీలేనందున వ్యవసాయ కూలీలు ఎవరూ అందుబాటు లో ఉండేవారు కాదు. కొత్త విధానాన్ని బట్టి వ్యవసాయ కూలి పనులకు అవసరమైనంత మేరకు కూలీలు దొరకు తారు. ఇదొక్కటే మంచి మార్పు. గతంలో వ్యవసాయ కూలీలు దొరక్క కొత్తగా వచ్చేవారికి కూలిరేట్లు పెంచి తీసుకోవడంలో రైతులకు ఎక్కువ సాగు ఖర్చయ్యేది. అంతేకాదు కూలీలు దొరకని సందర్భంలో యాంత్రీక వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించారు. అంతకు ముందు ఈ ఉపాధి పథకం ఉనికిలోలేని సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోకి యాంత్రాలొస్తేనే పేదలు ఉద్యమిం చేవారు. కొన్ని అధికార గణాంకాలుతీసుకుంటే పేదరికం
తగ్గిందన్నమాటకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ ఉపాధి (Rural employment)పథకాన్నే గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఆ పథకానికి తూట్లు పొడవడానికి ఏ విపక్ష నాయకుడు కానీ రైతులు కానీ అంగీకరించరు. సర్పంచ్లనడిగినా ఇదే చెబుతారు. కానీ కేంద్ర పాలకులు రూపురేఖావిలాస్తాలతో సహా ‘నరేగా’ను మార్చాల్సిందేననే ధోరణి వ్యక్తం చేస్తు న్నారు. ఈ పథకంలో అమలు క్రమంలో బయటపడిన డొల్లతనం కానీ, లోపాలు కానీ లేవని అనుకోలేం. అలా అని ఉపాధి పథకానికి 90శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వా లే సమకూర్చుకోవాలని ప్రతి పాదించడమంటే ఒక కాలు విరగ్గొట్టడమే అవుతుంది. నిధులుంటే సరే సరి. లేకుంటే ఆ పథకమూ, పథకం వల్ల కలిగే ప్రయోజనాల పరిస్థితి కుంటినడకే! తాజాగా ఉపాధి హామీ పథకం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆ జీవికా మిషన్- గ్రామీణ్ (వి.బి జీరామ్)గా మారుతుంది. ఈ పథకానికి మంగళం పాడేందుకే పేరు మార్పు పథక విధివిధానాల మార్పు అని అధికార పక్షం అంటుందని కాంగ్రెస్తోదితర విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే బిల్లును తాజాగా ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. అధికార పక్షం చేసే అంశాలపై తనదైన శైలి లో కొన్నిటిని ప్రశంసిస్తూ, కొన్నిటికి ఆమోదముద్ర వేస్తూ వచ్చిన కాంగ్రెస్, ఎంపీ శశిథరూర్ మాత్రం ఆ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం, పథకానికి దాదాపు స్వస్తి చెప్పే ఆలోచనతో చేస్తున్న మార్పులని వ్యతిరేకిం చారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత, వలసల తగ్గింపు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి సాధన అనే మూలసూత్రాలతో అమలవుతున్న ‘ఉపాధి’ని ఏక మొత్తంగా మార్పు చేయడం తగదని కాంగ్రెస్ ఎంపీలు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. కొత్తబిల్లు ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 60:౪౦ దామాషాలో ఖర్చులు భరించుకోవాలి. ఉత్తరాఖండ్ హిమా చల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్తో సహా ఈశాన్య, హిమాలయన్ రాష్ట్రాలు మాత్రం 10 శాతం నిధులు సమకూర్చుకోవాలి. ఈపథకం అమలు పర్యవేక్షణ కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిల్, రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిల్లు పర్యవేక్షిస్తాయి. సాగు సీజన్లలో పరిస్థితులను బట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలే తాత్కాలికంగా నిలిపివేసుకో వచ్చు. మహిళలు, వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక కూలీ రేట్లు ప్రభుత్వమే ప్రతిపాదిస్తోంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజులోపల ఉపాధిని కల్పించలేని పరిస్థి తులలో వారికి రోజువారీ నిరుద్యోగభృతిని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని కొత్త విధానాలను, అవకాశాలను వెలుసుబాటు చూపింది. ఏమయితేనేం కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్య తలు ఈ పథకం స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందని పలువురు చేస్తున్న విమర్శల గూర్చి కేంద్రం పునరాలోచన చేయాల్సి ఉంటుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Employment Scheme Gramina Upadhi latest news MGNREGA Rural Development Rural Employment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.