📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Rural Development – ఉపాధి హమీ పథకంలో పూర్తి స్థాయి పనులు – సీఎం చంద్రబాబు

Author Icon By Shravan
Updated: August 21, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rural Development : గ్రామీణాభివృద్ధికి ఉపాధి హమీ పథకం పరిధిలో పూర్తి స్థాయిలో పనుల చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన నరేగా పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితరంశాలపై నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు. గత ప్రభుత్వ హయంలో నిలిపివేసిన నరేగా బిల్లులన్నింటిని చెల్లిస్తున్నామన్నారు. 2014- 19 మధ్య కాలంలో జరిగిన ఉపాధి హమీ పథకం(నరేగా) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులకు బిల్లులు చెల్లించలేదు. బిల్లులు ఇవ్వకుండా వర్కులను క్లోజ్ చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శద్ద పెట్టింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సిఎం చంద్రబాబు ఈ విషయంపై పలు మార్లు చర్చించి నిధుల చెల్లింపులకు ఉన్న అడ్డంకులను తొలగించారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం క్లోజ్ చేసిన 3,54,177 పనులు ప్రస్తుతం ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పుచేశారు.

గ్రామీణ పనుల బిల్లుల చెల్లింపులకు సిఎం చంద్రబాబు ఆదేశాలు

కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపు (Bills payment) చేయడం ద్వారా న్యాయం చేసే అవకాశం ఏర్పడింది. ఈ ప్రక్రియపై సిఎం చంద్రబాబు సమీక్షా సమావేశాల్లో అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. మొత్తం రూ.179.38 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించి 5.54 లక్షల పనులను ఆన్ గోయింగ్ వర్కులుగా నమోదు చేశారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన పంచాయతీ రాజ్ శాఖ రూ.179 కోట్లకు గాను రూ.145 కోట్లను ప్రస్తుతం అప్లోడ్ చేసింది. ఈమొత్తానికి సంబంధించి ఆర్థిక శాఖ ఎన్ఐసికి నిధులు విడుదల చేసింది. పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు, గ్రామస్తుల అకౌంట్లలో 23వ తేదీన ఈ మొత్తం నిధులు జమకానున్నాయి. మిగిలిన మొత్తానికి సంబంధించి పలు సాంకేతిక కారణాలతో చెల్లింపు ప్రక్రియ నిలిచింది. అవసరమైన ఎస్టిమేషన్ లేకపోవడం, ఖర్చు చూపకపోవడం, ఆ పనిచేసిన ప్రాంతాలు పట్టణ ప్రాంతంలో విలీనం కావడం వంటి కారణాలతో ఆయా పనుల బిల్లుల చెల్లింపు ప్రక్రియ పెండింగ్లో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/certificates-re-examination-of-sadaram-certificates-to-remove-ineligible-persons/andhra-pradesh/533502/

Breaking News in Telugu CM Chandrababu naidu Employment Guarantee Scheme Latest News in Telugu Poverty Alleviation Schemes Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.