📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

RTI: సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

Author Icon By Saritha
Updated: February 21, 2026 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RTI: సమాచార హక్కు చట్టం ప్రకారం విధిగా ఇవ్వాల్సిన సమాచారాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తాజాగా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిని రాష్ట్రాలు తప్పకుండా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరుతూ వచ్చే దరఖాస్తులు, అప్పీళ్ల నిర్వహణ విషయంలో ఆర్టీఐఎంఐఎస్ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Read Also: AP: ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

RTI: Key change in Right to Information applications

ఫిబ్రవరి 18 నుంచి కొత్త విధానం అమలు

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం (AP Government) ఫిబ్రవరి 18, 2026 నుంచి ఈ కొత్త పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. ఎవరైనా సమాచారం కోరాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్ https://rtionline.ap.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, డిజిటల్ పద్ధతిలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కలిగింది.

ఆర్టీఐ ఆన్‌లైన్ విధానం

ఫిబ్రవరి 18వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చేస్తే.. ఎస్మెమ్మెస్, ఈ-మెయిల్స్ ద్వారా అప్ డేట్స్, 30 రోజుల్లో ప్రాథమిక సమాచార అధికారి (పీఐవో) నుంచి సమాధానం వస్తాయి.

దీనిపై అవసరమైతే ఫస్ట్ అప్పీలు, సెకండ్ అప్పీలు కూడా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వీటికి టైమ్ లైన్స్ కూడా ఇచ్చారు. జిల్లా నోడల్ ఆఫీసర్ అయితే 5 రోజుల్లో దరఖాస్తు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. పీఐవో అయితే 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఎఫ్ఏఏ అయితే 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. సెకండ్ అప్పీల్ విషయంలో 90 రోజుల్లో దాఖలు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల్ని ఇంటి దగ్గరి నుంచే ఆన్ లైన్ లో చేసుకోవడంతో పాటు ట్రాకింగ్, అప్పీల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

    Andhra Pradesh RTI News digital governance AP Latest News in Telugu RTI Online Website AP Supreme Court RTI Guidelines Telugu News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.