📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Roja: భాను వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా (Roja) తీవ్రంగా స్పందించారు. తనపై అనుచితంగా వ్యాఖ్యానించిన గాలి భాను ప్రకాష్ (Bhanu Prakash) పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆమె జాతీయ మహిళా కమిషన్‌తో పాటు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కు కూడా అధికారికంగా ఫిర్యాదు చేశారు.

రూ. 2 వేల వ్యాఖ్యపై తీవ్ర అభ్యంతరం

రూ. 2 వేలు ఇస్తే రోజా (Roja) ఏ పని అయినా చేసేది. అలాంటి రోజా ఇప్పుడు రూ. 2 వేల కోట్లను సంపాదించింది” అనే ప్రకటనతో తనపై గాలి భాను మాట్లాడిన తీరును రోజా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని హీనంగా చూపించడమే కాకుండా, మహిళల హక్కులపై (Women’s Rights) జరిగిన అవమానకరమైన దాడిగా అభివర్ణించారు.

“వ్యాంప్‌కి ఎక్కువ..హీరోయిన్‌కి తక్కువ”: ఎమెల్యే వ్యాఖ్యలపై ఆవేదన

భాను ప్రకాష్ తన గురించి “వ్యాంప్‌కు ఎక్కువ, హీరోయిన్‌కు తక్కువ”గా మాట్లాడడంపై రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది కేవలం వ్యక్తిగత దూషణ మాత్రమే కాదు, ఒక మహిళను హీనంగా చూపించాలన్న కుట్రల సరళిలో భాగమని ఆమె అన్నారు. ఒక మహిళ గురించి ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడిన భాను ప్రకాశ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

“ఇది నాపై మాత్రమే జరిగిన దాడి కాదు. రాష్ట్రంలో అధికారుల అక్రమాలపై ధైర్యంగా ప్రశ్నించే ప్రతి మహిళను నాశనం చేయాలన్న శక్తులకు చెందిన చర్య” అని అభిప్రాయపడ్డారు. ఇది ఓ ప్రమాదకరమైన సంస్కృతి అని ఆమె హెచ్చరించారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు

APPolitics BhanuPrakash Breaking News latest news PoliticalControversy roja RojaVsBhanu Telugu News WomenRespect

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.