కాజా నుంచి పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన రహదారిపై వాహనాలకు అనుమతి
విజయవాడ :విజయవాడ వెస్ట్ బైపాస్ను అధికారులు(RoadConnectivity) ప్రజలకు సంక్రాంతి కానుకగా అందుబాటులోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన రహదారిని అధికారులు ఒకవైపు అందుబాటులోకి తెచ్చి వాహ నాలను అనుమతించారు. ఎన్హెచ్ఎఐ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీన్ని ప్రారం భించారు. తొలుత ఎన్హెచ్ఎఐ అధికారుల వాహనాలు, ఆ తర్వాత ఇతర వాహనాలను పంపించారు.
Read Also: Nellore: ఇసుకపల్లి సముద్రం లో గల్లంతైన విద్యార్థుల వివరాలు
మార్చిలోపు మరో వైపు రహదారిని కూడా అందుబాటులోకి
తీసుకొస్తామని అధికారులు తెలిపారు. చెన్నై, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజా టోలేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్లోకి వచ్చి గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు వెళ్లి, అక్కడ ఏలూరువైపు హైవేలోకి చేరుకొని వెళ్లిపోవచ్చు. ఇప్పటికే గొల్లపూడి(RoadConnectivity) నుంచి చిన్నఅవుటపల్లి మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నేటి నుంచి కాజా వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఏలూరువైపు వెళ్లొచ్చు. అలాగే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్లో గొల్లపూడి వద్ద విజయవాడ హైదరాబాద్ హైవేలోకి చేరుకొని హైదరాబాద్ వైపు వెళ్లిపోవచ్చు.
దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాల్లో ఏలూరు, హైదరాబాద్ వెళ్లే వాహనాలేవీ విజయవాడ నగరంలోకి రావాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ వెస్ట్ బైపాస్లో గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనాలకు మాత్రం ప్రస్తుతం కాజా వరకు వచ్చేం దుకు అవకాశం లేదని ఎన్హెచ్ఎఐ అధికారులు తెలిపారు. మధ్య లో కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ వాహ నాలు ప్రస్తుతం అనుమతి ఉన్నట్లే గొల్లపూడి వైపు నుంచి వచ్చేటప్పుడు కృష్ణా నదిపై వంతెన, సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత మంగళగిరిమందడం రోడ్డులోకి చేరుకొని సచివాలయం, హైకోర్టు వైపు వెళ్లచ్చని పేర్కొన్నారు. పూర్తిస్థాయి రహదారి అం దుబాటులోకి వచ్చిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్ ఫీజు వసూ లు చేస్తామని అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: