దేశాల, రాష్ట్రాల అభివృద్ధి సూచికలు రహదారులు. రహదారులు ఎంత సౌకర్యవంతంగా ఉంటే అంత అభివృద్ధి చెందినట్లు లెక్క. జాతీయ స్థాయిలో రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులు, రాష్ట్రస్థాయిలో జిల్లాలను అలాగే గ్రామస్థాయిలో పల్లెలను కలుపుతూ రహదారులు ఉంటాయి. వీటిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగుతున్న వాహనాల రద్దీకి తగ్గట్టుగా రహదారులు విస్త రించడం అవసరం. అలానే సుదూరాలను దగ్గర చేయడానికి కొత్త రహదారులను నిర్మించడం (Road policy)అనివార్యం. ఒక దేశ అభివృద్ధిలో పెట్టుబడుల పరంగా పరిశ్రమలు రావాలంటే ఆ పరిశ్రమలకు తగిన భూమి ప్రభుత్వం చూపించాల్సి ఉం టుంది. ఒక నిర్ధిష్ట పరిధిలో నిర్మించే పరిశ్రమలకు ప్రభుత్వ భూములు ఉంటే వాటినే కేటాయిస్తారు. లేదంటే పరిహారం ఇచ్చి రైతుల వద్ద నుండి సేకరిస్తారు. కానీ కొత్త రహదారు లు (Road policy)నిర్మించే విషయంలో మాత్రం రహదారులకు కావలసిన భూమి అంతా రైతుల నుండి సేకరించాల్సిందే. దేశంలో అభివృద్ధి పథంలో నడవడానికి రోజురోజుకు కొత్త రహదారు లు నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఉన్న మార్గాన్ని విస్తరిస్తే బ్రౌన్ ఫీల్డ్ అని కొత్త మార్గాలను గ్రీన్ ఫీల్డ్ హైవేలని అంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతట సుమారు 600 కి.మి నిడివి గల గ్రీన్ఫీల్డ్ రహ దారులు నిర్మాణంలో ఉన్నాయి. కానీ రహదారుల నిర్మాణం లో కనబడే అభివృద్ధి వెనక ఎంతో మంది రైతుల వ్యధలు ఉన్నాయన్నది నిజం. భారీ భూస్వామ్యవ్యవస్థలు లేని మన దేశంలో భూమి అంతా చిన్నచిన్న కమతలుగా రైతుల చేతుల్లో ఉంది.
Read Also : http://Ajit Pawar: మృత్యువు ముందుగానే హెచ్చరించిందా?
రైతులకు నష్టపరిహారం
రహదారుల కింద కోల్పోతున్న భూములలో తాతలు, తండ్రుల నుండివారసత్వంగా వస్తున్న భూములు కొన్ని అయితే తిని తినక రూపాయి రూపాయి పోగుచేసు కొని కొన్న భూములు కొందరివి. రహదారులు క్రింద తమఅస్తిత్వం బ్రతుకుతెరువు అన్ని కోల్పోయి నగరాలకు వలస వెళ్లేవారు కొందరైతే ఒకటి రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతులు ఉన్నది కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారు తున్నారు. రహదారుల అమరికలో భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని చెల్లిస్తాయి. కానీ ఈ చెల్లించే నష్టపరిహారం రైతులకు ఏమాత్రం సరిపోదు అన్నది నిజం. రైతులకు ప్రభుత్వాలు భూమి, ప్రభుత్వ విలువను బట్టి దానికి అధనంగా పరిహారం ఇస్తారు. కానీ వాస్తవానికి మార్కెట్లో అదిప్రభుత్వ విలువకన్నా చాలా రెట్లు అధికంగా ఉంటుంది. సుమారు ఒక ఎకరం భూమి రోడ్డు పరిధిలో వెళితే ఆ ఎకరానికి ఇచ్చిన నష్టపరిహారంతో ఆ ప్రాంతంలో కనీసం సగం భూమి కూడా రాని పరిస్థితి ఉంది. పల్లెల్లో బండ్ల బాట, తారు రోడ్ల ప్రక్కన ఉన్న భూముల విలువ లోపలి భూముల కన్నా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రభుత్వ విలువ సమానంగా ఉన్నందున దీనికి లోపలి భూములకు ఒకే తరహా పరిహారం చెల్లించడంతో కొంతమంది రైతులకు నష్టం జరుగుతోంది. కొందరు రైతులు ప్రభుత్వంతో పోరాడలేక ఇచ్చే పరిహారానికి ఒప్పుకున్న మరికొందరు అధిక పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పరిహారం విషయం పక్కన పెడితే భూమిని నమ్ముకున్న రైతు తన వ్యవసాయ సాధన అను కూలతను బట్టి తన భూమిని చతురస్రాకార, దీర్ఘచతురస్రా కార ఆకారాలలో చిన్న కమతలుగా నిర్మించి తమకనువుగా వ్యవసాయం చేసుకుంటారు. నూతన రహదారుల అమరికలో అప్పటివరకు ఏకరీతిగా ఉన్న భూమి ఆకారం లేకుండా అవుతుంది. అది కూడా వ్యవసాయం చేయడానికి అనువుగా ఉండడం లేదు. మరి గ్రీన్ఫీల్డ్ లాంటి వాహన నియంత్రణ రహదారి పొడుగునా ప్రహరీ గోడ నిర్మించే రహదారుల్లో ఈ ఆకారం లేని భూభాగం సగం రహదారులకు ఒకప్రక్కన ఉంటే మిగిలినది మరొక్క ప్రక్కన ఉంటుంది. ఇటు నుండి అటు దాటలేని రహదారులు ప్రక్కన రైతులకు వ్యవసాయం చేయడం దినదిన గండంగా మారనుంది.
రైతుల వ్యధలు
ఈ రహదారుల అమరికలో భూమితోపాటు జల వనరులు అయిన బావులు సైతం పూడ్చాల్సి వస్తుంది. ఒకవేళ రహదారుల అమరికలో విద్యుత్, హై టెన్షన్లైన్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు, ఇరిగేషన్ కాలువలు లాంటివి నష్టపోతే మాత్రం వాటిని ఎంత ఖర్చైనా తిరిగి యధావిధిగా పునర్ నిర్మించే ప్రయ త్నం చేస్తారు. కానీ రైతులను పునర్మించడం లేదన్నది నిజం. అలాగే ఈ రహదారుల నిర్మాణంలో నిర్మాణానికి కావలసిన కంకర కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రకృతి సంపదగా వస్తున్న కొండలను పిండి చేసి రోడ్ల నిర్మాణంలో వాడుతున్నారు. ఈ రహదారులు భూమట్టం నుండి 23 మీటర్ల ఎత్తులో నిర్మించడం వల్ల దానికి కావాల్సిన మట్టిని గుట్టలు పుట్టలు తవ్వి వాడడంవల్ల పరిసర గ్రామాల ప్రజలకు కనీ సం ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే మట్టిదొరకడంలేదు. ఈ రోడ్లు నిర్మాణంలో భారీ వాహనాలు నడవడం వల్ల ఆ చుట్టుపక్క ప్రాంత రోడ్లుగుంతలు పడడం, అవి వేసే దుమ్ము ధూళి వల్ల పంటలు దిగుబడిచాకుండా నష్టపోతున్నాయి. ఇలా చెప్పుకుంటే రైతుల వ్యధలు అన్నిఇన్ని కావు. భవిష్యత్ తరాలకు అద్భుత ఫలాలనిచ్చే రహదారులను నిర్మించడం అవసరమే. అందుకు రైతులు అందరు సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ నిర్మాణంలో రైతు కోల్పోతున్న ఉనికిని, నష్టానికి తగ్గట్టుగా పరిహారానికి ప్రభుత్వాలు ఆలో చన చేయాలి. వ్యవసాయమే సుడిగుండం అయి రైతులను అతలాకుతలం చేస్తున్నవేళ ఇటువంటి అకాల పరిణామాల నుండి రైతులను రక్షించే బాధ్యత ప్రభుత్వాలదే.
-భైరబోయిన వెంకటేశ్వర్లు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: