📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Road accidents: వేగమా, జీవితమా! ఏది ముఖ్యం?

Author Icon By Sudha
Updated: January 6, 2026 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి సంవత్సరం జనవరి నెలలో దేశవ్యాప్తంగా నిర్వహిం చే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం మన సమాజా నికి అత్యంత అవసరమైన సందేశాన్ని అందిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో రహదారి రవాణామన దైనందిన జీవితంలో విడదీయరాని భాగమైంది. అయితే అభివృద్ధితో పాటు ప్రమాదాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం, చిన్నపాటి తప్పిదం విలువైన ప్రాణాలను కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రత మాసోత్సవం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, ప్రజల మనసుల్లో మార్పును తీసుకొచ్చే ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో (Road accidents)ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో అధికశాతం యువతే కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. కుటుంబానికి ఆశాకిరణంగా ఉన్న యువకుడు, తల్లిదండ్రుల కలలకు ప్రతి రూపమైన కుమార్తె, చిన్నారుల భవిష్యత్తుకు ఆధారమైన తండ్రి – ఇలా అనేక మంది రోడ్డు ప్రమాదాలు (Road accidents)బలవుతున్నారు. ఈప్రమాదాలకు ప్రధాన కారణాలు అధికవేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వాడకం, హెల్మెట్ లేదా సీట్బెల్ట్ ధరించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వంటి మానవ తప్పిదాలే. అంటే ప్రమాదాలు సహజంగా జరుగుతున్నవి కావు. మన నిర్లక్ష్యం వల్లే సంభవిస్తున్నాయి. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం ద్వారా ప్రభుత్వం, రవాణా శాఖ, పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీ లు, వర్క్షాపులు, ట్రాఫిక్ శిక్షణ శిబిరాలు నిర్వహిం చడం ద్వారా విద్యార్థులలో చిన్నతనం నుంచే భద్రతా భావనను నాటుతున్నారు. ఎందుకంటే పిల్లలు నేర్చుకున్న విలు వలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయి. రోడ్డు నా సొంతం కాదు – అందరిదీ” అనే భావన ప్రతి ఒక్కరిలో నాటితేనే నిజమైన మార్పు సాధ్యమవుతుంది.

Read Also: http://UP crime: విషపూరితమైన పండ్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి

Road accidents

రోడ్డు భద్రత అనేది కేవలం వాహనదారుల బాధ్యత మాత్రమే కాదు. పాదచారులు, సైక్లిస్టులు, ప్రయాణికులు అందరూ కలిసి పాటించాల్సిన సామూహిక బాధ్యత. పాదచారులు జీబ్రా క్రాసింగ్లను ఉపయోగించడం, ట్రాఫిక్ సంకేతాలను గౌర వించడం, రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా దాటకపోవడం వంటి చిన్నచిన్న జాగ్రత్తలు కూడా అనేక ప్రాణాలను కాపా డగలవు. అదే విధంగా, డ్రైవర్లు తమ నైపుణ్యంపై గర్వపడ కుండా, ఇతరుల ప్రాణాల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. నాకు ఏమీ కాదు” అనే నిర్లక్ష్య ధోరణి ఒక్క ప్రమాదంతోనే శాశ్వత విషాదంగా మారుతుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకో వాలి. ప్రభుత్వం రోడ్ల విస్తరణ, సిగ్నల్స్ ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ లిమిట్స్, కఠినచట్టాలు వంటి అనేక చర్య లు తీసుకుంటున్నా, ప్రజల సహకారం లేకుండా ఇవన్నీ పూర్తి ఫలితాలను ఇవ్వలేవు. చట్టం భయంతో కాకుండా, మనస్ఫూర్తిగా నిబంధనలు పాటించినప్పుడే రోడ్డు భద్రత సాధ్యమవుతుంది. హెల్మెట్ ధరించడం పోలీసులు భయం వల్ల కాదు – అది మన తలకాపాడే కవచం అని భావించిన ప్పుడే అవగాహన నిజంగా పెరిగినట్లవుతుంది. సీట్బెల్ట్ అనేది జరిమానా తప్పించుకునే సాధనం కాదు- అది మన ప్రాణాలను కాపాడే రక్షణ వలయం. మీడియా కూడా రోడ్డు భద్రత ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలి. ప్రమాదాల వార్త లను కేవలం సంచలనంగా కాకుండా, వాటి వెనుక ఉన్న కారణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజే యాలి. ఒక ప్రమాద కథ మరొకరికి గుణపాఠంగా మారితేనే వార్తల ఉద్దేశం నెరవేరుతుంది. అలాగే సామాజిక మాధ్య మాలు కూడా అవగాహన ప్రచారానికి శక్తివంతమైన వేదికలుగా మారవచ్చు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం మనకు ఒక ప్రశ్న వేస్తోంది – మీ వేగం కన్నా మీ జీవితం ముఖ్యమా కాదా? ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ తమ మనసు లో సమాధానం చెప్పుకోవాలి. ఒక నిమిషం ఆలస్యమవడం పర్వాలేదు, కానీ ఒక ప్రాణం కోల్పోవడం అసహ్యమైన విషాదం. మనం పాటించే ఒక్క నియమం, చూపించే ఒక్క జాగ్రత్త ఒక కుటుంబాన్ని దుఃఖం నుంచి కాపాడగలదు. ఈ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని ఒక నెలపాటు జరిగే కార్య క్రమంగా కాకుండా, జీవితాంతం కొనసాగే సంకల్పంగా మార్చుకుందాం. మనం మారితే మన కుటుంబం మారు తుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమా జం మారితే దేశం సురక్షితంగా ముందుకు సాగుతుంది.

-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news Life Safety road accidents road safety speeding Telugu News traffic rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.