📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

road accidents : ప్రమాద బాధితులను ‘రహ్‌వీర్‌’ కాపాడేనా?

Author Icon By Sudha
Updated: February 17, 2026 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి యాంత్రిక యుగంలో ప్రపం చంలోనే అత్యధిక రోడ్డు ప్రమా దాలకు నెలవుగా కొనసాగుతున్న మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్ట్ ఆదేశాలకు అను గుణంగా, మోర్త్ మార్గదర్శకాల తోడ్పాటుతో, ప్రపంచ బ్యాంక్ ప్రాయోజిత పథకాల తోడ్పాటుతో రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి చేస్తూనే వున్నాయి. ఓ వైపు ఘోర రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన ప్రణాళికల తో ముందుకు సాగుతూనే మరో వైపు ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు గోల్డెన్ అవర్లో తీవ్రంగా గాయపడిన బాధితులను సమీప క్రిటికల్ కేర్ హాస్పిటల్లో చేర్పించి వారి ప్రాణాలను కా పాడడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్న వైనం అభినందనీయమే. సదరు ప్రభుత్వ చర్యలలో భాగంగా 2021లో పురుడు పోసుకున్న గుడ్సమరిటన్ పథకం 31.3.2026 వరకే అమలులో ఉండేలా మార్గదర్శ కాలను రూపొందించి దేశంలో వివిధ రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు చేయడం కోసం ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాలలో వాటి అమలు అంతంత మాత్రమే జరిగిందనేది నిర్వివాదాంశమే. ఫలితంగా ఘోర రోడ్డు ప్రమాదాల (road accidents) బాధితులకు స్వాంతన చేకూర్చే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉండే బైస్టాండర్లకు గుడ్ సమరిటన్ లా పై అవగాహన కలగని కారణంగా మెడికో లీగల్ కేసుల నెపంతో పోలీసు శాఖ ఇబ్బందులు పాలు చేస్తారనే భయం నేటికీ వారిని వెంటాడుతోంది. ఫలితంగా గత ఐదేళ్ల కాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలలో (road accidents) గాయపడిన బాధితుల పాలిట జీవన రక్షకులుగా బై స్టాండర్లు పని చేయలేకపోయారు.

Read Also : Reels: ప్రమాదకర స్టంట్స్ చేస్తూ యువకుడి మృతి

road accidents

రోడ్డు భద్రత మాసోత్సవాలు

గతేడాది 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2025లో అప్పటికే నాలుగేళ్ల నుండి అమలులోవున్న ఈ పథకం పై విస్తృత ప్రచారం జరగలేదు. ఐతే నెలరోజుల ఆకార్యక్రమం లో చివరి దశలో ఘోర రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులను ‘గోల్డెన్అవర్’లో సమీప క్రిటికల్ కేర్ ఆస్పత్రులలో చేర్పించే బాధ్యతను చేపట్టే గుడ్ సమారిటన్ లకు ఇచ్చే బహుమతి మొత్తాన్ని ఐదువేల రూపాయల నుండి ఇరవై ఐదు వేలరూపాయలకు పెంచాలని ప్రధాన మంత్రి నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పత్రికాభిముఖంగా ప్రకటన చేయడం జరిగింది. సదరు ప్రకటనకు కొనసాగింపుగా నేమో అన్నట్లు ఈ సంవత్సరం మార్చి 31తో ముగిసి పోయే ఆ గుడ్ సమారిటన్ మార్గదర్శకాలను సవరిస్తూ గతేడాది ఏప్రిల్ మాసంలో ఈ పథకాన్ని రాహ్ వీర్గా (Rah-Veer)మారుస్తూ గతంలో ఓ నిర్దిష్ట కాల పరిమితికి మాత్రమే అమలులో వున్న ఈ పథకాన్ని నిరంతరం కొనసాగే పథకం గా మారుస్తూ కేంద్ర ఉపరితల రవాణాశాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ రాహవీర్ పథకాన్ని త్రికరణ శుద్ధిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేరు మార్చు కున్న ఈ పథకం ప్రకారం రాహవీర్లు(Rah-Veer)గా వ్యవహరిం చబోయే వ్యక్తులకు గతంలో ఉన్నరివార్డ్ 5000 రూపా యల మొత్తాన్ని 25000ల రూపాయలకు పెంచడంతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వాలనుకోవడం బై స్టాండర్లకు ఖచ్చితంగా ప్రోత్సాహకంగా మారుతుందని చెప్పక తప్పదు. మార్గదర్శకాల ప్రకారం ఒక సంవత్సర కాలంలో ఏ వ్యక్తి యైనా గరిష్టంగా ఐదుసార్లు ఈ ప్రోత్సాహక బహుమతిని అందుకోవచ్చు. ఇటీవలే ముగిసిన 37వ జాతీయరోడ్డు భద్రత మాసోత్సవాలు 2026లో రాహవీర్ పథకం పై విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో మోర్త్ మార్గదర్శకాల కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ కార్యాలయం రాప్పర్ విధి విధానాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపిస్తూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రత దృష్ట్యా అధిక సంఖ్యలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వం సం, రాష్ట్రస్థూల జాతీయ ఉత్పత్తిపై వాటి ప్రభావంనేపథ్యం లో వాటిని అమలు పరచాల్సిన బాధ్యతను వ్యక్తిగతం చేస్తూ త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాలని కలెక్టర్లకు ఆదేశాల ను జారీచేసింది.

పథకాన్ని బలో పేతం చేయాలని..

రాష్ట్రంలోని రహదారులపై ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి సదరు ప్రమాదాలలో తీవ్రంగా గాయ పడిన వారిని ఒక గంటలోపు సమీప క్రిటికల్ కేర్ ఆస్పత్రులలో చేర్పించిన వారి వివరాలను రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్కు చేరవేయడానికి జిల్లాల స్థాయిలో జిల్లాల కలెక్టర్ల చైర్మన్ షిప్లో ఓ అప్రైజల్ కమిటీ పనిచేస్తుంది. అందులో జిల్లా యస్.పి/ సి.పి ఆఫ్ పోలీస్ సభ్యులుగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరోసభ్యుడిగా, జిల్లా రవాణాశాఖ అధికారి కన్వీనర్గాకొనసాగుతారు. గుడ్ సమారిటన్ల వివరాలను (ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు పోలీసుశాఖ అధికారులు జాతీయ స్థాయిలో నిర్ధారించబడిన స్టాండర్డ్ అనెగ్యూర్లో పొందు పరిచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయంతో జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్కి పరిశీలన తగుచర్యల కోసం పం పించడంతో పాటు సదరు వివరాలను ఇడర్ పోర్టల్క అప్ లోడ్ చేయాల్సివుంటుంది. అదే విధంగా సదరు వివరాల ప్రతి నకలును అకనాలెడ్జ్మెంట్ రూపంలో ప్రతిపాదిత గుడ్ సమారిటన్కు అందించాలి. జిల్లా కలెక్టర్ తమ పరిశీల నానంతరం ప్రతి నెల అర్హులైన గుడ్ సమారిటన్ల వివరాలను కమిటీ కన్వీనర్గా కొనసాగుతున్న జిల్లా రవాణాశాఖ అధికారికి పంపడం జరుగుతుంది. తదనంతరం డి.టి.ఓ ఆ దరఖాస్తును రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్కు పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో పరిశీలన అనంతరం అర్హులైన రాహవీర్లకు ఇరవై ఐదువేల రూపాయలను పి.యఫ్. యమ్. యస్ అకౌంట్ ద్వారా గుడ్ సమారిటన్ల బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమచేయబడుతుంది. అట్టి మొత్తం జాతీయ రోడ్భద్రత నిధినుండి రాష్ట్ర రవాణాశాఖ కమి షనర్కు రియంబర్సుమెంట్ రూపంలో తిరిగి చెల్లించబ డుతుంది. ఈ నెల మూడవ తేదీన రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ కలెక్టర్లకు జారీచేసిన ఉత్తర్వులలో ప్రతి నెలా జిల్లాల స్థాయిలో జరిగే జిల్లా రహదారి భద్రత సమావేశాల లో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదికల ద్వారా, పోలీసుశాఖ, రవాణాశాఖ, వైద్య ఆరోగ్యశాఖల ప్రత్యేక చొరవతో రాప్పార్ పథకానికి సంబంధించి విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టడం ద్వారా ఘోర రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన బాధితుల ప్రాణాలను కాపాడడానికి ఓ అద్భుతమైన లైఫ్లైన్ ఉపయోగపడే ఈ పథకాన్ని బలో పేతం చేయాలని ఆదేశించారు.

road accidents

వినూత్న పథకం

ఐతే ప్రభుత్వ ప్రజాసంక్షేమ అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రజల్లోకితీసుకెళ్లే బాధ్యతను మోస్తున్న పబ్లిక్ రిలేషన్స్ శాఖ ఈ పథకం విధివిధానాలను, ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆశించిన ఫలి తాలు లభించవచ్చని పాలనా నిపుణులు అనుకుంటున్నారు. మరోవైపు అత్యంత ఘోర ప్రమాదాలలో తీవ్రంగా గాయ పడి ప్రమాద స్థలాల్లో మృత్యువుతో పోరాడుతున్న ప్రమాద బాధితుల పట్ల బై స్టాండర్లు ప్రాణదాతలుగా మారాలంటే రోడ్ సేఫ్టీ స్టేక్ హోల్డర్లయిన పోలీసుశాఖ పౌరుల అంతర్గత భద్రత కార్యక్రమాలలో తల మునకలుగా ఉన్నప్పటికీ, ఆ ఒత్తిళ్లను దాటి రహదారి ప్రమాదాల తీవ్రతను గుర్తిస్తూ రాహవీర్ పథకం అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి. అదే విధంగా అనునిత్యం రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నిండా మునిగి వుండే వైద్య ఆరోగ్యశాఖ సైతం రాహవీర్ గుర్తింపు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇకపోతే రాష్ట్రానికి అధిక మొత్తంలో రాబడి వనరుల ను సంపాదించి పెడుతున్నప్పటికీ సిబ్బంది కొరతతో విశాలమైన తమ పరిధిలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న రవాణాశాఖ కూడా ఇదేదో అదనపు బాధ్యతగా, బరువుగా భావించకుండా రాహవీర్ వథకం కన్వీనర్గా తన బాధ్యతను గుర్తెరిగి ఈ కార్యక్రమం అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆస్పత్రులలో చేరిన అర్హులైన ప్రమాద బాధితులకు ఆర్థిక భారం పడకుండా ఒక లక్షా ఏభై వేల రూపాయల నగదు రహిత ఉచిత వైద్య సహాయాన్ని అందించడానికి గతేడాది కాలం నుండి అందుబాటులో వున్న క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పథకం తన పేరు మార్చుకుని పి.యమ్. రాహత్ పేరుతో మరో వినూత్న పథకంగా నిన్నటికి నిన్న దేశ ప్రధాని చేతుల్లో పురుడు పోసుకోవడం కొసమెరుపు.
-డాక్టర్ నీలం సంపత్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Accident Victims BreakingNews Emergency Response latest news Rahveer scheme road accidents road safety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.