📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Road Accident: ట్రాక్టర్, ఆటో ఢీకొని ఇద్దరు శివస్వాములు మృతి

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కల్వకుర్తి : శివ మాలలు ధరించి నియమ నిష్టలతో నిత్య పూజలతో ఇరుముడులతో ఆటోలో శ్రీశైలం (Srisailam) బయలుదేరిన స్వాములకు ట్రాక్టర్వారి పాలిట యమపాశమై (Road Accident) ఇద్దరు స్వాములు మృతి చెందిన ఘటన మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలోని కల్వకుర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు.

Read Also: Telugu states: తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతావత్ సురేష్, వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట మండ లానికి చెందిన సత్యనారాయణ ఇద్దరు కలిసి ఆటోలో శ్రీశైలానికి వెళ్తుండగా కోట్ర చౌరస్తా సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో మండలంలోని కోట్ర గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఆటోని ఢీకొనడంతో ఇద్దరు శివస్వాములు మృతి (Road Accident) చెందారు. సంఘ టనా స్థలానికి చేరుకొని మృత దేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని ఎస్సై తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Auto Accident Devotees Death Kalwakurthy Latest News in Telugu Road Accident Shiva Devotees Shiva Mala Srisailam Telugu News tractor accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.