📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Road Accident: కారును ఢీ కొన్న లారీ ..నలుగురు మృత్యువాత

Author Icon By Sharanya
Updated: May 27, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తూర్పుగోదావరి జిల్లా ఆటోనగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సెలవులు కావడంతో కాకినాడలో హాస్టల్లో చదువుకుంటున్న మనవరాల్ని చూసేందుకు ఎంతో ఆత్రుతగా వెళుతున్న ఆ కుటుంబాన్ని ప్రమాదం చిదివేసింది. ఒక్క క్షణంలో జరిగిన ఈ సంఘటన, నలుగురు అమూల్యమైన ప్రాణాలను కాజేసింది.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు:

అప్పటిదాకా సంతోషంగా సాగిన కుటుంబ ప్రయాణం రెప్పపాటున కడతేరింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండల ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు మృత్యువాత పడడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు మృతి చెందడంతో కుటుంబంలో కన్నీరు మున్నీరుగా రోధను వినిపిస్తున్నాయి. అల్లుడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదంతా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అతివేగంగా రావడంతో ఎదురుగా ఉన్న లారీని ఢీకొనే క్రమంలో తప్పించిపోయి ఒక్కసారిగా డివైడ్ అవతలికి వెళ్లడంతో అడ్డుగా వెళుతున్న కారు ఢీకొనగా అంతా జరిగిపోయింది. మృతులు రెప్పపాటు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉప్పులూరి ప్రసాద్ (58), ఉప్పులూరి లీలావతి ( 54) ఇమ్మని సత్యవతి (72),లక్కంసాని బిందు ( 33), పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. కుటుంబాన్ని నాశనం చేసిన యూటర్న్

ప్రమాదానికి ప్రధాన కారణంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యతే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన విషయాన్ని లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ వెల్లడించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అకస్మాత్తుగా యూటర్న్ చేసుకునే క్రమంలో కొవ్వూరు నుంచి కాకినాడ వైపు వస్తున్న వీరి వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రమాద సమయంలో జరిగిన ఘటనను ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటనతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్ర విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి, సమాజాన్ని కుదిపేసింది. మనవరాలిని చూసేందుకు ప్రేమతో బయలుదేరిన ప్రయాణం, ఒక్క ప్రమాదంతో శవయాత్రగా మారింది. స్థానికంగా ప్రజలు శోకంలో మునిగిపోయారు.

Read also: Guntur: భార్యను అశ్లీల వీడియోలతో చిత్రహింసలకు గురి చేసిన కానిస్టేబుల్

#AccidentUpdate #CarLorryAccident #East Godavari #FatalAccident #RoadAccident #RoadSafety #SpeedKills #TragicCrash Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.