ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అతి వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమేనని నివేదికలు చెబుతున్నాయి. (AP Crime) పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో విషాదం నెలకొంది. నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు.. అతి వేగంతో వెళ్లి.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు
కేసు నమోదు
(AP Crime) ప్రమాద సమయంలో ఆ కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఆ కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే వారిద్దరికి కూడా తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.మరోవైపు.. చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్ చేసి.. సమాచారం ఇచ్చారు. ఇక ఈ కారు, కంటైనర్ ప్రమాదంపై స్థానికుల నుంచి పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: