📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

road accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

Author Icon By Saritha
Updated: January 21, 2026 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలో(Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కన్నారి క్రాస్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సింధనూరు సిరుగుప్ప మార్గంలోని కన్నారి క్రాస్‌ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బొలేరో వాహనాలు బలంగా ఢీకొని ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత వాహనాల వేగానికి మృతదేహాలు నడి రోడ్డుపై విసిరేసినట్లు చెల్లాచెదురుగా పడిపోయాయని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కుంటనహాల్, మదిరె గ్రామాలకు చెందిన వారితో పాటుగా సిరుగుప్ప తాలూకాలోని చెళ్లకుడ్లూరు వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: JimMurray WhiskyBible:విస్కీలకు ర్యాంకులు! లిస్ట్‌లో ఇండియన్ బ్రాండ్!!

ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా మదిరెకు చెందిన ఎరుకల మల్లయ్య, కుంటనహాల్‌ మల్లయ్య, గుడికంబాలి గిరి అనే ముగ్గురు వ్యక్తులు చనిోపోయినట్లు పోలీసులు గుర్తించారు. (road accident) వీరంతా సోమవారం రాత్రి గొర్రెల కోసం సింధనూరుకు బయల్దేరి వెళ్లారు. మంగళవారం రోజు ఉదయం గొర్రెలు కొనుగోలు చేశారు. అనంతరం గొర్రెలను బొలెరో వాహనంలో తీసుకుని సొంతూర్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే బొలెరో వాహనం రిపేర్ కావటంతో.. అక్కడే ఆగిపోయారు. బొలెరో వాహనాన్నిబాగు చేయించుకొని మంగళవారం సాయంత్రం 6 గంటలకు సొంతూర్లకు బయలుదేరారు. అయితే రాత్రికల్లా ఊర్లకు చేరుకుంటామనగా ఘోరం చోటుచేసుకుంది.

A road accident in Karnataka claims the lives of five people from Andhra Pradesh.

బయల్దేరిన కాసేపటికే కన్నారి క్రాస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో బొలెరో బలంగా ఢీకొట్టింది. రహదారిపై రెండు వాహనాలు ఒక వైపే వేగంగా రావటంతో పరస్పరం బలంగా ఢీకొన్నాయి. రహదారిపై ఓవైపు కొత్త రోడ్డు ఉండగా.. మరోవైపు గోతులమయంగా ఉంది. దీంతో ఇద్దరు డ్రైవర్లు ఒకేవైపు వేగంగా వచ్చారు. దీంతో రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడు మంది చనిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Victims Bolero Collision Karnataka Latest News in Telugu Raichur District Road Accident Sindhanur Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.