हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest Telugu news : Right to education: విద్యా హక్కు పరిరక్షణ అందరి బాధ్యత

Sudha
Latest Telugu news : Right to education: విద్యా హక్కు పరిరక్షణ అందరి బాధ్యత

ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీన్నే రాష్ట్రీ య శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభి వృద్ధికి విశేష కృషి చేసిన మోలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్పనిచేశారు. 1947 నుంచి 1958 వరకు తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. భారతదేశానికి మొదటి ఉప రాష్ట్రపతిగా కూడా ఆయన సేవలందించారు. జాతీయ విద్యా దినోత్స వాన్ని 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మోలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా విద్యా హక్కు (Right to education)పరిరక్షణ గురించి ఆలోచించా ల్సిన అవసరం అనివార్యంగా ఉంది. విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. విద్యాహక్కు (Right to education)చట్టం హామీ ఇచ్చిన విధంగా వీరందరికీ వాళ్ల వయసుకు తగిన తరగతిలో చేర్పించి విద్య నందించడమూ ఒక సవాలే. యునిసెఫ్ ప్రకారం దాదాపు సగం మంది ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం సుమా రు 43 శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడిమాని వేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఇది 55 శాతం షెడ్యూల్డ్ తెగల్లో 63శాతం దాకా ఉందని అంచనా. విద్య ను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యా యుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యా యులను అధికంగా తయారు చేయలేకపోతుందనేది సత్యం. సాధా రణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యా యుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీ కరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అంది స్తాడు. గురు వుల బోధనతోనే విద్యార్థులు ప్రపంచాన్ని తెలుసుకుంటారు. ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రపంచం లో సుమారు 80 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా అందులో 23.8 కోట్ల మంది మనదేశంలోనే ఉన్నట్లు వెల్లడైంది.

Read Also : http://Adani Group: గుజరాత్‌లో అతి పెద్ద బ్యాటరీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం

Right to education
Right to education

నాణ్యమైన విద్య

నాణ్యమైన విద్య నందించడం ద్వారా ప్రతి ఒక్కరూ అవసరమైన స్థాయిలో చదువు నేర్చుకుని, తర్వాతి తరగతిలోకి ప్రవేశించగలిగేలా చేయాల్సిన బాధ్యత పాఠశాలపై ఉంటుందనీ చట్టం పేర్కొంటోంది. న్యూటన్, పైథాగరస్, సర్వేపల్లి రాధా కృష్ణన్ మొదలైన వారు ఆదర్శంగా నిలిచారు. విశ్వామిత్రు డు, సాందీపుడు, పరశురాముడు, ఆదిశంకరా చార్యులు, ద్రోణాచార్యులు, పరమహంస మొదలైన వారంతా పేరొం దిన గురువులు. విద్య అనే ఆస్తిని సమానంగా పంచగల శక్తి ఒక ఉపాధ్యాయుడికే ఉంది. ప్రజాదరణ, అపారమైన గౌరవం ఉన్న కారణంగానే ఎంతోమంది ఉపాధ్యా యులు నాయకులయ్యారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవా ల్సిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృన్. ఒక అధ్యాపకు డు భారత దేశానికి రాష్టప్రతిగా పనిచేసిన ఘనత ఆయనకే చెల్లింది. ఆయన పుట్టిన రోజును మనదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా పదవీకాలం ముగియగానే చెన్నైలోని అన్నా విశ్వ విద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. బోధన చేస్తూనే ఆయన తుదిశ్వాస విడిచారు. యావత్
ప్రపంచా నికి ఆయన గొప్ప సందేశాన్ని అందించారు. నీతివంతమైన జీవనానికి అలవాటుపడే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చి దిద్దగలగాలి. సమాజాలు మారొచ్చు, సిద్ధాంతాలు మారొచ్చు. కానీ విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య సంబంధం శాశ్వతమై నది. ఈ విషయాన్ని యువ ఉపాధ్యాయులు గుర్తుంచు కోవాలి. విద్యార్థుల భవిష్యత్పనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సమాచారం అందివ్వడంతోనే ఉపాధ్యాయుడి పాత్ర ముగియదని నిజానికి ఉపాధ్యాయుడు రకరకాల నైపు ణ్యాల్ని విద్యార్థులకు అందించవలసి ఉంటుందని కొఠారి కమిషన్ పేర్కొంది. జాతి నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వా త కీలకపాత్ర పోషించేది గురువే అవుతాడు. అనేక మంది గురువులు విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచు కున్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టే వారు తమ వృత్తిని ప్రేమించే లక్షణం కలిగి ఉండాలి. తాము భావిపౌరులను తీర్చిదిద్దుతున్నామనే భావనఉండాలి.

Right to education
Right to education

విద్యా లక్ష్యం

విద్యార్థి ఎగిరే గాలిపటం అయితే దానికి ఆధారమైన దారంగురువు. ఉపాధ్యాయులు తమ మేధోసంపత్తిని పెంపొందించుకోవాలి. తమ జీవిత కాలంలో కనీసం నాలుగు తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వృత్తి నైపుణ్యాల పెంపు, కంప్యూటర్ వినియోగం, డిజిటల్ లిట రసీ కార్యక్రమాలను నిర్వహించాలి. బాలబాలికల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణన్ మార్చలేని గతాన్ని గురించి ఆలోచించ వద్దు.. చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు అనేవారు. ఉపాధ్యాయ లోకం కానీ రిమోట్ లెర్నింగ్అందించడానికి, వెనకబడుతున్న విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి, అభ్యాస అంతరాలను తగ్గించేలా ఉపాధ్యాయుల కృషి పరంగా ఇది చాలా కీలక సమయం. విద్య భవిష్యత్తును, బోధనావృత్తిని రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం. ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతుల్ని పునః సమీక్షించు కొని తదనుగుణంగా విద్యార్థులను నవ సమాజనికి అం దించాలి. ఒకప్పుడు గుమాస్తాలను తయారుచేసే విధంగా విద్యా లక్ష్యం వుండేది. నేడు సామాజిక ప్రాధాన్యతలు మారిపోయాయి. దేశానికి పరిశోధకులు కావాలి. వ్యక్తుల స్వభావాన్ని, సామర్ధ్యాన్ని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ప్రవచించిన అబ్దుల్ కలాం పలుకులకు సార్థకత చేకూర్చాలి. నేటి యువ ఉపాధ్యాయులు అందుకు కంకణ బద్ధులై వృత్తిని నిబద్ధతతో నిర్వర్తించాలి.
-రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870