📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ACB : ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి

Author Icon By Sudheer
Updated: April 19, 2025 • 10:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సదుం మండలం తహశీల్దార్ కార్యాలయంలో శనివారం లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖ వీఆర్వో ఏసీబీ వలలో చిక్కాడు. రైతు షఫీ ఉల్లా అనే వ్యక్తి నుండి రూ.75,000 లంచం తీసుకుంటుండగా, వీఆర్వో మహబూబ్ బాషాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఎస్పీ ఎస్.వి. ప్రశాంతి ఈ దాడులపై పూర్తి వివరాలను వెల్లడించారు.

60 సెంట్ల భూమిని సెటిల్‌మెంట్

షఫీ ఉల్లా అనే రైతు ఐదు ఎకరాల 60 సెంట్ల భూమిని సెటిల్‌మెంట్ ల్యాండ్‌గా పరిగణించి అసైన్‌మెంట్‌గా రిజిస్టర్ చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు రూ.1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఎక్కువగా ఉందని భావించిన రైతు, చివరకు ఎమ్మార్వోతో రూ.75,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయినప్పటికీ లంచం ఇవ్వడం తనకు ఇష్టం లేకపోవడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఆధారాలతో కూడిన సమాచారంతో శనివారం ఏసీబీ అధికారులు వేషధారణలో కార్యాలయం వద్ద మోహరించి, లంచం తీసుకుంటున్న సమయంలో వీఆర్వో మహబూబ్ బాషాను అడ్డగించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఎస్పీ ఎస్.వి. ప్రశాంతి తెలిపారు. ఈ ఘటనతో అధికార విభాగాల్లో కలకలం రేగింది.

ACB Google News in Telugu Revenue officer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.