📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Revenue Department: డాట్ ల్యాండ్ సమస్యలు ఎన్నెన్నో… చుక్కల భూములపై దళారుల కన్ను

Author Icon By Pooja
Updated: December 16, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయం : రెవెన్యూ లోపాలు(Revenue Department) సవరించడంలో అధికారులతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి విఫలమయ్యారని ఆరోపణలు రైతుల నుండి వినవస్తున్నాయి. 22ఏ లో ఉన్న భూములకు మినహాయింపు ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్ళలోనే ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇంతవరకు అది ఆచరణ సాధ్యం కాలేదు. ఆ సమస్యపై రెవెన్యూ మంత్రి పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పటికీ రైతులకు మాత్రం న్యాయం జరగలేదు. అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం రెండో విడత ఫూలింగ్కి తీసుకుంటున్నప్పటికీ అక్కడ అది ప్రధాన సమస్యగా ఉండడం గమనార్హం.

Read Also: Tirumala: ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు

Numerous problems with dotted lands…

ఆ గ్రామంలోల దాదాపు 20శాతం భూములు(Revenue Department) 22ఏ లోనే ఉండడంతో సిఆర్డిఎ అధికారులకు తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు సన్న చిన్నకారు రైతులు భూములు అమ్ముకోవాలంటే 22ఏ అడ్డంకిగా మారటం తెలిసిన విషయమే. ఈ విషయంపైనే గతంలో ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) పలు జిల్లాల నుండి ఈ సమస్యల ఎదురైంది దీన్ని అధికారం చేపట్టిన మరుక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో జరిగే ప్రతి క్యాబినెట్ సమావేశంలోనూ రెవెన్యూ సమక్షలో ముఖమంత్రి రెవెన్యూశాఖ మంత్రికి రెవెన్యూ అధికా రులకు పలుమార్లు సూచించినప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంతో రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మరి ముఖ్యంగా దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అంతరంగంపై ఉండగా ఆ విషయాలపై కూడా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఇటీవల రెవెన్యూ సమస్యల్లో ప్రధానంగా ఫిర్యాదుల వచ్చాయి. ఈ నెలలో జరిగిన రెవెన్యూ సమీక్షలో ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డాట్ ల్యాండ్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఈ సమస్యపై దృష్టి సారించక పోవడం ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం జరుగుతుందని రైతులు విమర్శిస్తున్నారు.

చుక్కుల భూములను సాకుగా చూపి రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని పలుమార్లు ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అధికారులను రైతులు తప్పుపడుతున్నారు. అసైన్డ్ భూములను క్రమబద్దీకరించే క్రమంలో చుక్కుల భూములకు పరిష్కారం చూపిస్తామంటూ కొందరు దళారులు రెవెన్యూ యంత్రాంగంతో పరిచయాలను సాకుగా చూపి అమాయక రైతులను మోసం చేస్తున్న సంఘటనలో భాగంగా పలు ఫిర్యాదులు అందాయి. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తీవ్రంగా రైతన్న ఎదుర్కొంటున్నప్పటికీ పరిష్కరించే క్రమంలో రెవెన్యూ మంత్రి కఠినంగా వ్యవహరించక పోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి ముఖ్యమంత్రి ఆదేశాలను నెరవేర్చాలని లేదంటే ధర్నాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పలువురు రైతులు వివరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu LandIssues Latest News in Telugu PropertyProblems RealEstateFraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.